బిగ్‌బాస్ స్కెచ్‌: టాప్ 5లోకి అవినాష్‌!

24 Nov, 2020 16:45 IST|Sakshi

ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద ఒక‌రు రాళ్లు విసురుకుంటూ బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ క్ర‌మంలో పన్నెండో వారం బిగ్‌బాస్ చేప‌ట్టిన నామినేష‌న్ ప్ర‌క్రియ ఎన్నో మ‌లుపులు తిరుగుతోంది. మొద‌ట‌గా కంటెస్టెంట్ల ల‌క్ ఆధారంగా నామినేషన్‌ను చేప‌ట్టాడు. ఎరుపు రంగు నింపి ఉన్న టోపీలు ధ‌రించిన అఖిల్‌, అభిజిత్‌, అరియానా, అవినాష్ నామినేట్ అవ‌గా గ్రీన్ రంగుతో నిండిన టోపీలు ధ‌రించిన సోహైల్‌, మోనాల్ సేవ్ అయ్యారు. ఇక్క‌డే బిగ్‌బాస్ ట్విస్టిచ్చాడు. సేవ్ అయిన వారితో స్వాప్(స్థానాలు ఇచ్చిపుచ్చికోవ‌డం) చేసుకునే అవ‌కాశాన్ని నామినేట్ అయిన కంటెస్టెంట్ల‌కు క‌ల్పించాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఆఖ‌రి ఎపిసోడ్ అప్పుడే!)

బిగ్‌బాస్ హౌస్‌లో ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్‌
దీంతో అరియానా, అవినాష్ స్వాప్ కోసం సోహైల్‌ను అభ్య‌ర్థించి మోనాల్ మీద మాత్రం విరుచుకుప‌డ్డారు. అవినాష్ అయితే మోనాల్ ఈ షోకు అర్హురాలే కాదు, ఆమె ఏమీ ఆడ‌టం లేదంటూ చిందులు తొక్కాడు. చివ‌రికి కెప్టెన్ హారిక త‌న ప‌వ‌ర్‌తో మోనాల్‌ను నామినేష‌న్‌లోకి పంపించ‌డం. అభిని సేవ్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. నామినేట్ అవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయిన అవినాష్‌ ల‌క్ లేక‌పోతే ఎలిమినేట్ కావాల్సిందేనా అని ఆందోళ‌న చెందాడు. ఈ క్ర‌మంలో నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు బిగ్‌బాస్ మ‌రో అవ‌కాశాన్ని క‌ల్పించాడు. జెండాలు సేక‌రించే టాస్కు ఇవ్వ‌గా ఇందులో అవినాష్‌, అఖిల్ గెలిచారు. ఈ ఇద్ద‌రికీ ముడిప‌డ‌టంతో హౌస్‌లో ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ న‌డిచిన‌ట్లు స‌మాచారం. ఇందులో అఖిల్‌కు సోహైల్‌, మోనాల్... అవినాష్‌కు హారిక‌, అరియానా, అభిజిత్ స‌పోర్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అవినాష్ ఇమ్యూనిటీ పొందాడు. కానీ అది ఈ వారం కాద‌ట‌. త‌ర్వాతి రెండు వారాలకు ఇమ్యూనిటీ పొందాడని స‌మాచారం. (చ‌ద‌వండి: జ‌బ‌ర్ద‌స్త్‌లోకి మ‌ళ్లీ తీసుకుంటారు: అవినాష్ త‌మ్ముళ్లు)

అవినాష్ కోసం రంగంలోకి జ‌బ‌ర్ద‌స్త్‌
ఇదే క‌న‌క నిజ‌మైతే అవినాష్‌ ఈ వారం ఒక్క‌ ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కితే ఏకంగా టాప్ 5లో క‌ర్చీఫ్ వేసిన‌ట్లే. కానీ బ‌య‌ట పరిస్థితులు చూస్తుంటే అవినాష్‌కు ఇది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. నామినేష‌న్‌లో మోనాల్ మీద విరుచుకుప‌డ‌టం, సింప‌థీ గేమ్ ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్న అప‌నింద.. వెర‌సి అత‌ని మీద వ్య‌తిరేక‌త‌ను పెంచుతున్నాయి. దీంతో అవినాష్‌కు అత్యంత కీల‌కం కానున్న ఈ వారం నుంచి స్నేహితుడిని కాపాడేందుకు జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ రంగంలోకి దిగింది. అంద‌ర్ని న‌వ్వుల్తో ముంచెత్తుతున్న అవినాష్‌కు ఓట్లేయాలంటూ క‌మెడియ‌న్లు గెట‌ప్ శ్రీను, ఆటో రాంప్ర‌సాద్ అభిమానుల‌కు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. మ‌రోవైపు అభి, హారిక ఫ్యాన్స్ ఈసారి మోనాల్‌ను కాపాడే ప‌నిలో ఉన్నారు. అఖిల్‌కు ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌నే ఉంది. దీంతో అరియానా, అవినాష్ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. అయితే బిగ్‌బాస్ ప్లానింగ్ చూస్తోంటే అవినాష్‌కు త‌క్కువ ఓట్లు వ‌స్తే ఈ వారం ఎలిమినేష‌న్‌ను ఎత్తేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదంటున్నారు జ‌నాలు. చూడాలి మ‌రి.. అవినాష్ ల‌క్ ఎంతుందో? (చ‌ద‌వండి: నీతో రిలేష‌నే వ‌ద్దు: తేల్చేసిన అఖిల్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు