బిగ్‌బాస్‌: రాత్రి 9 దాటితే ఆ ఇద్ద‌రి క‌థ వేరే..

22 Nov, 2020 15:54 IST|Sakshi

నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్ల‌ను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిస‌భ్యులు సైతం రెట్టింపు ఉత్సాహంతో గేమ్స్ ఆడేందుకు త‌యార‌య్యారు. అందులో భాగంగా మ్యూజిక్ విని, అది ఏ పాటో చెప్ప‌మ‌ని ఆదేశించారు. దీంతో మ్యూజిక్ ప్లే అవ‌గానే పోటాపోటీగా బ‌జ‌ర్ కొడుతూ‌ పాట‌ల పేర్లు చెప్తున్నారు. ఈ క్ర‌మంలో ఆట‌లో అర‌టి పండుగా పేర్కొన్న అవినాష్‌ను నాగార్జున మ‌రోసారి ఆడుకున్న‌ట్లు తెలుస్తోంది. అటు అవినాష్ కూడా ఇంట్లో వాళ్ల‌ను ఇమిటేట్ చేసి వాళ్ల‌ను ఆడుకున్నాడు. ఇక మ‌రో గేమ్‌లో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్‌ను అవినాష్ వేళ్ల‌కు అందంగా రుద్దాడు. ఇది చూసిన నాగ్ ఎంత బాగా వేస్తున్నాడో అన‌డంతో అవినాష్ అందుకుని రాత్రి 9 త‌ర్వాత అత‌డికి ఇదే ప‌ని అని కౌంట‌రిచ్చాడు. త‌ర్వాత అవినాష్ చీర క‌ట్టుకుని డ్యాన్స్ చేయ‌గా రాత్రి 9 త‌ర్వాత నీది కూడా ఇదే ప‌నా అని నాగ్ పంచ్ వేశాడు. దీంతో అవినాష్ ప‌రువు గంగ‌లో క‌లిసింది. మ‌రి సండేను ఫండే చేసేందుకు వ‌చ్చిన నాగార్జున వారితో ఎన్ని ర‌కాల ఆట‌లు ఆడించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: అవినాష్ టాప్ 2లో ఉండ‌కూడ‌దు: ‌హారిక‌)

కాగా నిన్న‌టి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో స్టేజీ మీద‌కు వ‌చ్చిన‌ కంటెస్టెంట్ల కుటుంబాలు అంద‌రి గురించి నాలుగు మంచి మాట‌లు చెప్పి త‌మ వాళ్ల‌ను చెట్టెక్కి కూర్చోబెట్టేందుకు ప్ర‌య‌త్నించాయి. కానీ సోహైల్ బంధువులు మాత్రం అత‌డి ప‌రువు పోగొట్టే వ్యాఖ్య‌లు చేశారు. రాత్రి తొమ్మిది త‌ర్వాత సోహైల్ చాలా బిజీ అంటూ అత‌డి గుట్టును ర‌ట్టు చేశారు. అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడ‌ని చెప్ప‌డంతో అంద‌రూ షాక‌య్యారు. కాగా మొద‌ట్లో వీరావేశంతో చిందులు తొక్కే సోహైల్ నాగార్జున సూచ‌న మేర‌కు కోపాన్ని త‌గ్గించుకుంటాన‌ని మాటిచ్చాడు. మ‌రుక్ష‌ణం నుంచి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంద‌రితో క‌లిసిపోతూ, న‌వ్విస్తూ, టాస్కులు ఆడుతూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వ‌చ్చాడు. అలా అంద‌రి ఆద‌రాభిమానాలు చూర‌గొంటున్నాడు నిన్న వ‌చ్చిన కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ కూడా దాదాపు సోహైల్ టాప్ 5లో ఉంటార‌ని చెప్ప‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. సోహైల్‌తో పాటు అభిజిత్‌, అఖిల్‌, అరియానా, హారిక కూడా ఫైనల్‌కు వెళ్తార‌ని అంచ‌నా వేశారు. రియాలిటీలోనూ ఈ ర్యాంకింగ్సే నిజ‌మ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. (చ‌ద‌వండి: సోహైల్‌ను తాత అని పిలుస్తాం..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు