బిగ్‌బాస్‌ : ఈరోజు హోస్ట్‌ ఉన్నట్టా లేనట్టా!

24 Oct, 2020 16:57 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో తొలిసారి హోస్ట్‌ లేకుండా ఈ శనివారం ఎపిసోడ్‌ జరగనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్ ‌4 రెగ్యులర్‌ హోస్ట్‌ నాగార్జున వైల్డ్‌డాగ్‌ షూటింగ్‌ నిమిత్తం మనాలికి వెళ్లినట్లు ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ శని, ఆదివారాల్లో నాగ్‌ స్థానంలో సమంత హోస్ట్‌ చేస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా బిగ్‌బాస్‌ రిలీజ్‌ చేసిన ప్రోమోలో కేవలం ఇంటి సభ్యులు మాత్రమే కనిపించారు. దీంతో ఈ శనివారం హోస్ట్‌ లేకుండానే ఎపిసోడ్‌ జరగనుందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం ఈరోజు మాత్రమే హోస్ట్‌ లేకుండా జరగనుందని.. ఆదివారం యాథాతధంగా నాగ్‌ స్థానంలో సమంత ఎపిసోడ్‌ నడిపించనున్నట్లు టాక్‌. ఒకవేళ బిగ్‌బాస్‌ మరో ప్రోమో రిలీజ్‌ చేస్తే ఈ శనివారం హోస్ట్‌ ఉన్నారా లేరా అనే దానిపై క్లారిటీ రానుంది. ఇక తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో  నిన్నటి ఎపిసోడ్‌కు తరువాయి బాగంగా కంటిన్యూ కానున్నట్లు తెలుస్తోంది. (చదవండి : బిగ్‌బాస్‌: అభిజిత్‌, అఖిల్ ఒక్క‌ట‌య్యారు!)

శుక్రవారం బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు బిగ్‌బాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా చేయాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, దివి అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా, నోయ‌ల్ డీఓపీగా, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా,  లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్, హారిక‌, సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా ఉన్నారు. వారి సినిమాకు ప్రేమ మొదలైంది అనే టైటిల్‌ ఇచ్చారు. కాగా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులందరూ కలిసి ఎంతో కష్టపడి సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇంటిసభ్యులు తీసిన ప్రేమ మొదలైంది సినిమాకు సంబంధించి ప్రీమియర్‌ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రీమియర్‌ సందర్భంగా సినిమాలో నటించిన ఇంటి సభ్యులు తమ కారెక్టర్‌లను తెరపై చూసుకొని మురిసిపోయారు.

ప్రీమియర్‌కు సంబంధించిన విశేషాలను చెప్పడానికి అరియానా యాంకర్‌గా వ్యవహరించింది. ఇంటి సభ్యుల వద్దకు వెళ్లి వారి వద్ద మైకు పెట్టే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా సోహైల్‌ అరియానాపై తనదైన శైలిలో సెటైర్‌ వేశాడు. ప్రేమ మొదలైంది సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన సోహైల్‌ వద్దకు వచ్చిన అరియానా ఏవేవో ప్రశ్నలు సంధిస్తుండటంతో .. ఇంత చేయమంటే అంత చేస్తుంది అంటూ అరియానాకు పంచ్‌ ఇచ్చాడు.   ఆ తర్వాత బీబీ స్టార్‌ అవార్డ్స్‌ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించినట్లుగా ప్రోమోలో తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సోహైల్‌ , లాస్యలు యాంకరింగ్‌గా వ్యవహరించారు. ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి అవార్డు అందిస్తున్నట్లు వీడియోలో చూపించారు. మొత్తానికి ఈ శనివారం ప్రీమియర్ సినిమాషో హోస్ట్‌ లేకున్నా ఆసక్తికరంగానే సాగనున్నట్లు సమాచారం. అయితే నామినేషన్‌లో ఉన్న సభ్యుల్లో ఎవరు సేవ్‌ అవుతారన్నది చూడాలంటే ఎపిసోడ్‌ వచ్చే వరకు ఆగాల్సిందే. (చదవండి : ఎలిమినేష‌న్‌: మోనాల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు