బిగ్‌బాస్‌: మోనాల్‌పై అభి, అఖిల్ సెటైర్లు

23 Oct, 2020 15:45 IST|Sakshi

స్టెప్పులు నేర్చుకుంటున్న హారిక‌

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో చాలావ‌ర‌కు పాత టాస్కుల‌నే తిరిగి ప్ర‌వేశ‌పెడుతున్నారు. కొత్త‌గా ఆలోచించ‌డానికి బిగ్‌బాస్‌కు బ‌ద్ధ‌కం అనుకుంటా అని చాలామంది దీనిపై సెటైర్లు కూడా వేశారు. అయినా స‌రే త‌న దారి అడ్డ‌దారి అనుకునే బిగ్‌బాస్ రెండు, మూడు సీజ‌న్ల‌లో పెట్టిన సినిమా టాస్క్‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టాడు. ఇంటిస‌భ్యులంద‌రూ సినిమా తీయాల‌ని ఆదేశించాడు. అయితే కంటెస్టెంట్లు మాత్రం పాత వాస‌న‌లు త‌గ‌ల‌కుండా కొత్త‌గా ఏదైనా చేస్తారేమో చూడాలి. ఇక ఇప్ప‌టికే రిలీజైన ప్రోమోలో.. కంటెస్టెంట్లు అంద‌రూ బిగ్‌బాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. తూర్పు ప‌డ‌మ‌ర‌లా ఉండే అభిజిత్‌, అఖిల్ తొలిసారి న‌వ్వుకుంటూ మాట్లాడుకున్నారు. పైగా ఇద్ద‌రూ క‌లిసి మోనాల్‌పై పంచులు వేయ‌డం విశేషం. (చ‌ద‌వండి: మ‌నాలిలో నాగ్‌: బిగ్‌బాస్‌కు స‌మంత‌?)

ద‌ర్శ‌కుడిలా అవ‌తార‌మెత్తిన అభిజిత్‌.. మోనాల్‌ను చూసి హీరోయిన్ ఏంటి ఇలా ఉంద‌ని కౌంట‌రిచ్చాడు. ఆమెను డైరెక్ట‌ర్‌కు ప‌రిచ‌యం చేస్తున్న అఖిల్‌.. మేక‌ప్ లేకుంటే ఇలానే ఉంటుంద‌ని పంచ్ వేశాడు. ఇక కొరియోగ్రాఫ‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ హారిక‌కు స్టెప్పు నేర్పిస్తున్నాడు. నోయ‌ల్ కెమెరామెన్‌గా ప‌ని చేస్తున్నాడు. అరియానా, అవినాష్ బావా మ‌ర‌ద‌ళ్లుగా క‌నిపించ‌నున్నారు. బావా, ఒక్క‌సారి నీ ముఖం అద్దంలో చూసుకో అన్న డైలాగ్ కూడా బాగానే పండింది. ఇక లాస్య హీరోయిన్ మోనాల్‌కు సోహైల్‌ను ఐట‌మ్ రాజాగా ప‌రిచ‌యం చేసింది. దీంతో హౌస్‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు పూశాయి. మ‌రి ఈ సినిమా స్కిట్‌లో ఎవ‌రు ఇర‌గ‌దీయ‌నున్నారు? ఎవ‌రు అంద‌రి చేత మ‌న్న‌న‌న‌లు పొంద‌నున్నార‌నేది చూడాలి. ఈ ప్రోమోను చూసిన నెటిజ‌న్లు సినిమాలో క‌థ వేరే ఉంట‌ది అనే డైలాగ్ వ‌స్తే బాగుండ‌ని ఆశ‌ప‌డుతున్నారు. అలాగే హారిక‌, సోహైల్ క‌లిసి డ్యాన్స్ చేస్తే ఆ టాస్క్ ఎక్క‌డికో వెళ్లిపోతుందంటున్నారు. చూస్తుంటే నేటి ఎపిసోడ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ డోసు పెర‌గ‌నున్న‌ట్లే క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : అఖిల్‌కి అంత పొగరా?)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు