నామినేష‌న్ అప్పుడు చూపిస్తా: అవినాష్‌

23 Oct, 2020 23:14 IST|Sakshi

దేత్త‌డికి ఇస్మార్ట్ సోహైల్‌ గోరుముద్ద‌లు

దివికి గంట ఎక్కువ సేపు ప‌డుకునే అదృష్టం

మోనాల్‌కు ఎలా ప్ర‌పోజ్ చేయాలో నేర్పించిన అభిజిత్‌

అఖిల్‌, అభిజిత్ బ‌ద్ధ శ‌త్రువులుగానే అంద‌రికీ తెలుసు. కానీ నేటి ఎపిసోడ్‌లో మాత్రం ఒక‌రి మీద ఒక‌రు జోకులు వేసుకోవ‌డంతో పాటు ఇద్ద‌రూ క‌లిసి మోనాల్‌పై పంచులు వేశారు. ఒక గొడ‌వ‌లో అయితే అఖిల్ అభికి స‌పోర్ట్ చేశాడు. ఇక అభి.. అఖిల్‌, మోనాల్‌కు ల‌వ్ సీన్లు ఎలా చేయాలో వివ‌రించడం గ‌మ‌నార్హం. ఇక ఎప్పుడూ న‌వ్వుతూ, న‌వ్విస్తూ ఉండే అవినాష్ షూటింగ్‌లో తెగ ఫ్ర‌స్టేట్ అయ్యాడు. టాస్క్‌లో స్క్రీన్ రైట‌ర్ అయిన‌ప్ప‌టికీ సినిమాలో ప‌ల్లెటూరి బావ పాత్ర‌లో న‌టించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా జ‌రిగిందో చ‌దివేసేయండి..

గంట ఎక్స్‌ట్రా నిద్ర కోసం త‌న్నుకు చ‌చ్చారు
బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఏ కంటెస్టెంటు మ్యాట్రెస్ మీద చివ‌రి వ‌ర‌కు ఉంటారో వారికి ఒక‌రోజు ఓ గంట ఎక్కువ సేపు ప‌డుకునే అవ‌కాశం క‌ల్పించాడు. ఈ టాస్క్‌లో దివి విజ‌యం సాధించింది. దీంతో నేడు ఆమె ఆ బెడ్‌పై ప‌డుకునే ఛాన్స్ కొట్టేయ‌డంతో పాటు త‌ర్వాతి రోజు ఓ గంట ఆల‌స్యంగా లేచే అవ‌కాశాన్ని పొందింది. బిగ్‌బాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా చేయాల్సి ఉంటుంద‌ని బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌ను ఆదేశించాడు. (ఎలిమినేష‌న్‌: మోనాల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌)

హారిక‌కు గోరుముద్ద‌లు పెట్టిన సోహైల్‌
అభిజిత్ ద‌ర్శ‌కుడిగా, దివి అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా, నోయ‌ల్ డీఓపీగా, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా,  లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్, హారిక‌, సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా ఉంటారు. మేక‌ప్ లేకుండా క‌నిపిస్తే మా సినిమా ప‌రువు పోతుంది అని అభి అన‌డంతో దివి ఆమెను లోప‌ల‌కు తీసుకెళ్లింది. ఇక మాస్ట‌ర్ హారిక జోడీకి ఐట‌మ్ సాంగ్ నేర్పించే ప‌నిలో ప‌డ్డాడు. త‌ర్వాత సోహైల్ హారిక‌కు తినిపించాడు. ఐట‌మ్ సాంగ్ ఎక్క‌డ చేయాల‌న్న విష‌యంలో మాస్ట‌ర్ అభిజిత్ సీరియ‌స్ అయ్యారు. (వాళ్ల‌కు సాయం చేయ‌ను: ఏడ్చేసిన‌ హారిక‌)

సోహైల్‌ను ఏడిపించిన లాస్య‌
అఖిల్‌, మోనాల్‌ను ప‌క్క‌న పెట్టేసి ద‌ర్శ‌కుడు అరియానా, అవినాష్‌ల మీద ఫోక‌స్ పెట్టాడు. ఇక నోయ‌ల్ అరియానాను ఏడిపించే తుంట‌రి అబ్బాయిగా న‌టించాడు. అప్పుడు అవినాష్ సీన్‌లోకి దిగి ఆమెను కాపాడ‌తాడు. సోహైల్‌ను ఐట‌మ్ అని కాసేపు ఏడిపించారు. 'బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్లు తోపు ద‌మ్ముంటే ఆపు' అని లాస్య ప్రాస‌తో ఉన్న టైటిల్ చెప్ప‌గా మాస్ట‌ర్, మోనాల్‌ బాగుంద‌ని మెచ్చుకున్నారు. డైలాగుల విష‌యంలో అవినాష్‌కు, అభికి బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. ఈ విష‌యంలో అఖిల్ అభికి స‌పోర్ట్ చేశాడు. త‌న రెండు సీన్ల‌కే సినిమా మొత్తం నాదే అంటున్నార‌ని అవినాష్ వాపోయాడు. స్క్రిప్ట్ రైట‌ర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవ‌డం లేద‌ని విసుగు ప్ర‌ద‌ర్శించాడు. క్లైమాక్స్ కూడా వ‌ద్దంటున్నార‌ని అలిగాడు.

అఖిల్ ఒడిలో ఒదిగిపోయిన మోనాల్‌
ఇక అఖిల్‌, మోనాల్ ల‌వ్ ట్రాక్‌ను అభి డైరెక్ట్ చేయ‌క త‌ప్ప‌లేదు. దీంతో అభి ఏం ఫిట్టింగ్ పెట్టారు బిగ్‌బాస్ అని త‌న‌ను తానే తిట్టుకుంటూనే అఖిల్‌ను ఓ పాట‌తో ఆమెను ప‌డేయ‌మ‌ని సూచించాడు. ఇంత మంచి  అవ‌కాశం వ‌చ్చాకా అఖిల్ వ‌దులుకుంటాడా? మొన్న క‌నిపించావు, మైమ‌రిచిపోయాను.. అంటూ సాంగ్ మొద‌లుపెట్ట‌గానే మోనాల్ అత‌డి ఒడిలో చేరిపోయింది. వాళ్లు పాత్ర‌లో న‌టించ‌డం కాదు నిజంగానే జీవించేయ‌డం అభి కూడా మెచ్చుకోక త‌ప్ప‌లేదు. త‌ర్వాత హారిక‌, సోహైల్ కెవ్వు కేక‌ ఐట‌మ్ సాంగ్‌కు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. 

ఎట్ట‌కేల‌కు సినిమా షూటింగ్ పూర్తి
త‌ర్వాత ఓ సీన్ చేయాల్సి ఉండ‌గా అస్త‌మానం ట‌చప్‌లు ఇస్తూ లాస్య‌, జోకులు పేలుస్తూ దివి అంద‌రినీ డిస్ట‌ర్బ్ చేస్తున్నారు. దీంతో కావాల‌ని ఎక్కువ టేకులు తీసుకుంటున్నార‌ని ఈ సీన్‌లో తాను చేయ‌నంటూ అవినాష్ మండిప‌డ్డారు. షూటింగ్‌లో సీరియ‌స్‌గా ఉండ‌క‌పోతే త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పుకొచ్చాడు. వాళ్లంద‌రికీ నామినేష‌న్ స‌మ‌యంలో చూపిస్తాన‌ని కోపాన్ని అణుచుకునేందుకు ప్ర‌య‌త్నించాడు‌. ఎట్ట‌కేల‌కు అర్ధ‌రాత్రి మూడున్న‌ర‌కు సినిమా పూర్తి చేశారు. (మ‌నాలిలో నాగ్‌: బిగ్‌బాస్‌కు స‌మంత‌?)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు