బిగ్‌బాస్‌: నిరీక్ష‌ణకు తెర దించే స‌మ‌యం!

6 Sep, 2020 14:25 IST|Sakshi

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది క‌రోనా కాలం. ఏ ప‌ని మొద‌లు ప‌ట్టినా అన్నీ అడ్డంకులే. అందుకే మొన్న‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ వల్ల టీవీ సీరియ‌ళ్ల షూటింగ్‌లు ఆగిపోయి పాత ఎపిసోడ్ల‌నే తిప్పి తిప్పి వేశారు. అటు సినిమా వాళ్లేమో భ‌యంతో షూటింగ్స్‌కు వెళ్ల‌డానికి ఇప్ప‌టికీ చాలా మంది వెన‌క‌డుగు వేస్తున్నారు. కానీ ముందు జాగ్ర‌త్తలు తీసుకుంటూ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవచ్చని కేంద్ర‌మే ప‌చ్చ‌జెండా ఊపింది. అందుకే బిగ్‌బాస్ వ‌చ్చేస్తున్నాడు. "మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు" అంటూ బోలెడంత వినోదాన్ని పంచేందుకు సిద్ధ‌మయ్యాడు. (చ‌ద‌వండి: నాలానే ఉండాలనుకుంటున్నాను: దివీ వైద్య)

అస‌లే బిగ్‌బాస్ షో ప్రారంభ‌మ‌య్యే ఈ రోజు కోసం ఎంతోమంది క‌ళ్ల‌లో వ‌త్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు. తీరా అస‌లు సిస‌లైన రోజు రానే వ‌చ్చింది. బిగ్‌బాస్ టీమ్‌.. కంటెస్టెంట్ల‌ ఎంట్రీ ఎపిసోడ్ ప్రోమోను వ‌దిలింది. ఇందులో హీరో నాగార్జున కింగ్‌లా స్టేజ్‌పైకి దిగుతుంటే ఆయ‌న‌ను చూడటానికి అభిమానుల‌కు రెండు క‌ళ్లు చాల‌డం లేదు. హీరోయిన్ డ్యాన్సులు, గ్రాండ్ ఎంట్రీల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌కు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వ‌నుంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!)

ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియో చూసిన ప్రేక్ష‌కులు నాగ్ గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లా అంటూ ఆయ‌నపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక పంచెక‌ట్టులో ఉన్న‌ది షో  కోసం ప్ర‌త్యేకంగా వ‌చ్చిన అతిథా?  లేక కంటెస్టెంటు అయ్యుంటారా? అని గుసగుస‌లు పెడుతున్నారు. మ‌రోవైపు ఈ ప్రోమోలో క‌నిపించిన మ‌త్తెక్కించే క‌ళ్లు ఎవ‌రివ‌ని నెట్టింట‌ ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు. హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ అయ్యుంటుందా? లేదా వేరే యాంక‌ర్లు అయ్యుంటారా అని చ‌ర్చ‌లు పెడుతున్నారు. ఇలాంటి ఎన్నో సందేహాల‌కు స‌మాధానం దొర‌కాలంటే మ‌రికొద్ది గంట‌లు ఎదురు చూడాల్సిందే. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌-4: 15 మంది కంటెస్టెంట్స్‌ వీళ్లే!)

మరిన్ని వార్తలు