సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్‌ ఆఫర్‌

22 Dec, 2020 17:25 IST|Sakshi

బుల్లితెర ప్రేక్షకులను 106 రోజుల పాటు అలరించిన బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ మొన్నటి ఆదివారంతో ముగిసింది. నాల్గో సీజన్‌ విన్నర్‌గా అభిజిత్‌ నిలిచినా... అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు సోహైల్‌. సెకండ్‌ రన్నరఫ్‌గా నిలిచినా.. విన్నర్‌ సాధించినంత ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్‌ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది.
(చదవండి : బిగ్‌బాస్‌ : హారిక నా చెల్లి.. అభిజిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

అందులో నుంచి రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానంటే.. వద్దని, ఆమొత్తాన్ని నేనే ఇస్తానని నాగార్జున్‌ చెప్పాడు. ఐదు లక్షలు మిత్రుడు మెహబూబ్‌కి ఇస్తానంటే.. వద్దొద్దు.. నేనే మెహబూబ్‌కి పది లక్షలు ఇస్తానని షోకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి చెప్పాడు. దీంతో సోహైల్‌కు మంచి పేరు రావడంతో పాటు రూ.25లక్షలు దక్కాయి. అంతే కాకుండా తను తీయబోయే సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తానని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పడం సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఇది ఇలా ఉంటే సోహైల్‌ను మరో బంపర్‌ ఆఫర్‌ వరించింది.  ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. ఈ విషయాన్ని సోహైలే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మనందం ఫోన్‌ చేసి.. సోహైల్ నీ కోసమే బిగ్‌బాస్‌ చూశా అన్ని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తానని చెప్పారు. అలాగే నేను తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి’ అని సోహైల్‌ చెప్పుకొచ్చాడు ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహెల్‌కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటున్నారు నెటిజన్స్. ఇలా ఓ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

A post shared by Telugu Entertainment Page🔥 (@dubcaffehub)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు