బిగ్‌ స‌ర్‌ప్రైజ్‌: హౌస్‌లోకి కంటెస్టెంట్ల‌ ఫ్యామిలీ‌స్‌!

17 Nov, 2020 17:45 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలోకి అడుగు పెట్టింది. బ‌రువెక్కిన హృద‌యాల‌తో మెహ‌బూబ్‌కు వీడ్కోలు చెప్పిన కంటెస్టెంట్లు సోమ‌వారం మాత్రం ఆగ్ర‌హంతో మాట‌ల తూటాలు పేల్చుతూ ర‌గిలిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒక‌రిని ఒక‌రు దిగజార్చుకు ప్ర‌య‌త్నం చేశారు. గ‌త వారం అంద‌రూ అరియానాను నామినేట్ చేయ‌గా ఈసారి ఎక్కువ మంది అభిజిత్‌ను టార్గెట్ చేశారు. కానీ ఏం చేసినా, ఎంత ఎగిరెగిరి ప‌డ్డా వాళ్ల‌కే న‌ష్టం కానీ అభికి మాత్రం పోయేదేమీ లేదు. పైగా త‌న అభిమాన గ‌ణం అభి ఏం చేసినా వెన‌కేసుకురావ‌డానికి, అనుక్ష‌ణం స‌పోర్ట్ చేయ‌డానికి రెడీగా ఉండ‌నే ఉంది. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ షో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మ‌జిలీలో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్న‌ కంటెస్టెంట్లకు ఇంటినుంచి లేఖ‌లు అందాయి. కానీ ఇప్ప‌టికీ వారిని చూసుకునే భాగ్యం క‌ల‌గ‌లేదు.  కొంద‌రికైతే ఆ లెట‌ర్స్ కూడా ద‌క్క‌లేదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ నుంచి మెహ‌బూబ్ అవుట్‌!)

షో ముగియ‌డానికి మ‌రికొద్ది రోజులే ఉన్న త‌రుణంలో కంటెస్టెంట్ల‌ కుటుంబీకులను ఇంట్లోకి పంపిస్తారా? లేదా? అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేశారు. కానీ ఆ రోజు రానే వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఫిజిక‌ల్ టాస్కులో క‌ష్ట‌ప‌డి అలిసిపోతున్న ఇంటిస‌భ్యుల‌కు ఈ రెండు రోజుల్లో స్పెష‌ల్ సర్‌ప్రైజ్ ఉండ‌బోతుంద‌ట‌. బాధ‌తో బరువెక్కిన కంటెస్టెంట్ల హృద‌యాల‌ను లాలించేందుకు వారి ఆప్తులు హౌస్‌లోకి అడుగు పెట్ట‌నున్నార‌ట‌. ఈ మేర‌కు ఓ వార్త‌ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోం‌ది. ఇదే క‌న‌క నిజ‌మైతే ఇంటిస‌భ్యుల క‌న్నీటి వ‌ర‌ద‌తో ఎపిసోడ్‌ ఎమోష‌న‌ల్‌గా మార‌నుంది. అస‌లే సూటిపోటి మాట‌ల‌తో వైరాలు పెంచుకుని అగాధాలు సృష్టించుకుని కోప‌తాపాల్లో కూరుకుపోయిన ఇంటిస‌భ్యుల‌కు ఈ అవ‌కాశం మంచి బూస్ట్ ఇచ్చిన‌ట్లవుతుంది. మ‌రి నిజంగా నేటి ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ వ‌స్తారా? లేదా? అన్న విష‌యంపై క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: లాస్యకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు