నా పోరాటం ముగిసింది: హారిక‌

17 Dec, 2020 23:40 IST|Sakshi

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ఒడిదొడుకుల‌ను దాటుకుని టాప్ 5కు చేరుకున్న కంటెస్టెంట్లను సంతృప్తి ప‌రిచేందుకు బిగ్‌బాస్ వారి జ‌ర్నీ వీడియోల‌ను చూపించారు. ఈ ప్ర‌యాణాన్ని త‌నివితీరా వీక్షించిన‌ ఫైన‌లిస్టులు వారి భ‌యాందోళ‌న‌ల‌ను మ‌ర్చిపోయి మ‌న‌సు తేలిక చేసుకున్నారు. బిగ్‌బాస్ త‌మ‌కు ఎంతో గుర్తింపునిచ్చింద‌ని సంతోషంగా ఫీల‌య్యారు. మ‌రి ఈ సంద‌ర్భంగా బిగ్‌బాస్ ఎవరికి ఏమేం చెప్పాడో తెలియాలంటే ఈ స్టోరీ చ‌దివేయండి..

చిన్న ప్యాకెట్ పెద్ద ధ‌మాకా..
నిన్న అఖిల్‌, అభిజిత్ ప్ర‌యాణాన్ని చూపించిన బిగ్‌బాస్ నేడు మ‌రో ముగ్గురి జ‌ర్నీ వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించారు. ముందుగా గార్డెన్ ఏరియాలోకి వ‌చ్చిన హారిక‌ను... ఈ ప్ర‌యాణంలో ప్ర‌త్యేకంగా నిలిచార‌ని, ఎవ‌రి స‌పోర్ట్ లేక‌పోయినా ప‌ట్టుద‌ల‌, మొండిద‌ల‌తో ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చార‌ని బిగ్‌బాస్ అభినందించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధ‌మాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఫైన‌లిస్టుగా నిలిచార‌ని చెప్తూ జ‌ర్నీ వీడియో చూపించారు. ఇందులో అభిజిత్‌తో క‌లిసున్న క్ష‌ణాలను చూపించ‌డంతో హారిక సంతోషప‌డింది. (చ‌ద‌వండి:ఓటింగ్‌లో అభిజిత్‌ను దాటేసిన అరియానా!)

నిద్ర లేని రాత్రిళ్లు గ‌డిపాను
అలాగే త‌ను చేసిన అల్ల‌రి, టాస్కుల‌ను అన్నింటినీ చూపించ‌డంతో భావోద్వేగానికి లోనైంది. మిక్చ‌ర్ పొట్లంలా అన్ని ఎమోష‌న్స్ క‌ల‌గ‌ల‌పి ఉన్న త‌న జ‌ర్నీ చూసి ఈ బిగ్‌బాస్ ప్ర‌యాణం త‌న‌కు గొప్ప అనుభ‌వ‌మ‌ని చెప్పుకొచ్చింది. ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రిళ్లు గ‌డిపాన‌ని, కానీ ఈ జ‌ర్నీ చూడ‌గానే ఆ క‌ష్ట‌మంతా ఎగిరిపోయింద‌ని పేర్కొంది. రేపు త‌ను ఉన్నా లేక‌పోయినా త‌న జీవితాన్ని తెరిచి చూస్తే అందులో బిగ్‌బాస్ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తుంద‌ని తెలిపింది. అయితే త‌న‌కు సంతృప్తినిచ్చిన బిగ్‌బాస్ షోలో త‌న పోరాటం ఇక్క‌డితో ముగిసింద‌ని చెప్ప‌డం ఆమె అభిమానుల‌కు రుచించ‌డం లేదు. (చ‌ద‌వండి:బిగ్‌బాస్‌: రీయూనియ‌న్ పార్టీ ఉంటుందా?)

నా సినిమాకు 20 మంది కూడా ఉండ‌రు
త‌ర్వాత సోహైల్ వెళ్ల‌గా.. మీరు అన్ని భావోద్వేగాల‌ను చూపించార‌ని బిగ్‌బాస్ తెలిపాడు. స్నేహం అనే ప‌దానికి కొత్త అర్థాన్ని సృష్టించార‌ని మెచ్చుకున్నాడు. ఆట ప‌ట్ల అత‌డికి ఉన్న ధ్యాస‌, తాప‌త్ర‌యానికి బిగ్‌బాస్ సెల్యూట్ చేశాడు. మీ శ్ర‌మ‌, ప్ర‌తిభ ఊరికే పోద‌ని, ఇకపై మీ క‌థ వేరేలా ఉంటుంద‌ని సోహైల్ డైలాగ్‌ను అత‌డికే అప్ప‌జెప్పాడు.  అనంత‌రం అత‌డి జ‌ర్నీ వీడియోను చూపించ‌గా... అందులో బాధ‌, కోపం, స్నేహం, ప్రేమ అన్నింటినీ చూపించడంతో సోహైల్ కంట‌త‌డి పెట్టుకున్నాడు. నా సినిమాకు నేనే టికెట్టు కొనుక్కునేవాడిని. నా సినిమాకు 20 మంది కూడా రాలేద‌ని హేళ‌న చేసేవారు. కానీ ఇప్పుడు న‌న్ను బిగ్‌బాస్‌లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు నేను సినిమా చేస్తే ప్రేక్ష‌కులు హిట్ కొడ‌తార‌ని ఆశిస్తున్నా. ప‌ది సంవ‌త్స‌రాల క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం 105 రోజుల్లో ఇచ్చార‌న్నాడు. ట్రోఫీ రాక‌పోయినా మ‌నసుకు సంతోషాన్నిచ్చారు, అది చాలంటూ ఉప్పొంగిపోయాడు. అనంత‌రం త‌న స్నేహితులు మెహ‌బూబ్‌, అఖిల్ ఉన్న ఫొటోల‌తో పాటు త‌న సింగిల్ ఫొటోను తీసుకుని లోప‌ల‌కు వెళ్లాడు. 

అరియానా.. షైనింగ్ స్టార్‌
త‌ర్వాత‌ వ‌చ్చిన అరియానాను ఉద్దేశించి బిగ్‌బాస్ మీరొక సంచ‌ల‌నం అని పేర్కొన్నాడు. సొంత నియ‌మాల‌తో సొంత ఆట‌ను ఆడార‌ని, కానీ కొన్నిసార్లు ఒంట‌రయ్యార‌ని గుర్తు చేశాడు. అంద‌రి గురి మీమీదే ఉన్నా ధైర్యంగా ముందుకు సాగార‌ని మెచ్చుకుంటూ ఆమెను షైనింగ్ స్టార్‌గా అభివ‌ర్ణించాడు. అనంత‌రం ఆమె జ‌ర్నీ చూపించ‌డంతో అరియానా ఎమోష‌న‌ల్ అయంది. స‌మాజంలో త‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపునిచ్చార‌ని ధ‌న్య‌వాదాలు తెలిపింది. అనంత‌రం అవినాష్ త‌న‌కు తినిపించిన ఫొటోతో పాటు బిగ్‌బాస్ ఇచ్చిన‌ చింటూ బొమ్మ‌ను హ‌త్తుకున్న ఫొటోను తీసుకుంది. (చ‌ద‌వండి: ఆరేళ్లు రిలేష‌న్‌షిప్‌, డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు