దివి ఎలిమినేట్‌: ఇదిగో సాక్ష్యం

25 Oct, 2020 15:41 IST|Sakshi

ద‌స‌రా కానుక‌గా ఈసారి ఎలిమినేష‌న్ ఉండ‌దు కాబోలు అనుకున్నారంతా! ఒక‌వేళ ఉన్నా మోనాల్ గ‌జ్జ‌ర్‌నే సానంపుతార‌ని ఫిక్స్ అయ్యారు. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్రేక్ష‌కుల ఓట్ల క‌న్నా వారికి కావాల్సిన కంటెస్టెంట్ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేశారు. మోనాల్‌ను మ‌ళ్లీ సేవ్ చేస్తూ దివిని ఎలిమినేట్ చేశారు. సోష‌ల్ మీడియాలో లీకువీరులు మాత్ర‌మే కాదు, బిగ్‌బాస్ బ‌జ్ వ్యాఖ్యాత‌ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇదే నిజ‌మని ప‌రోక్షంగా సూచిస్తున్నారు. అదెలాగంటే రాహుల్ ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. అందులో ఇప్ప‌టివ‌ర‌కు హౌస్‌ను వీడిన ఏడుగురు.. సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, కుమార్ సాయి ఫొటోల‌తోపాటు దివి కూడా ఉంది. దీంతో దివి ఎలిమినేష‌న్ నిజ‌మేన‌న్న విష‌యం తేలిపోయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కుమార్ సాయిని గెంటేశారు!)

కాగా దివి సోమ‌వారం నాటి నామినేష‌న్స్‌లో లాస్య‌ను సేవ్ చేస్తూ త‌న‌కు తానుగా నామినేట్ అయింది. అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో జోడి క‌ట్ట‌డం ఆమెకు పెద్ద మైన‌స్‌గా మారింది. ఎన్నో పాజిటివిటీ అంశాలు త‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ అమ్మ రాజ‌శేఖ‌ర్ వెన‌కాలే ఉండ‌టం, ఆయ‌న చెప్పిన‌ట్టుగా న‌డుచుకోవ‌డంతో అత‌డిపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఈమెపై చూపించారు. ఫ‌లితంగా దివికి వ్య‌తిరేక ఓట్లు ఎక్కువ ప‌డ్డట్టు తెలుస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు నో ఆప్ష‌న్‌: మోనాల్‌ను పంపించాల్సిందే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు