మెహబూబ్‌ వల్లే సోహైల్ అలా చేశాడా?!

21 Dec, 2020 11:08 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సేపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడని బిగ్‌బాస్‌ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రూపాయి పెర్మార్మెన్స్‌ చేయమంటే మూడు రూపాయల యాక్టింగ్‌తో బిల్డప్‌ ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌-4 గ్రాండ్‌ ఫినాలే సందర్భంలోనూ అతని అతి కనిపించిందని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి మెహబూబ్‌ గురించి మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టుగా చేశాడని, అతనికి చిరంజీవి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కూడా ఆ ఓవర్‌ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. బిగ్‌బాస్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని ప్రవర్తనలో మార్పు లేదని మండిపడుతున్నారు. (అఖిల్‌ నిజంగానే బకరా అయ్యాడా?!)

ఇదిలాఉంటే.. గ్రాండ్‌ ఫినాలేకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయినవారు టాప్‌ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్‌ కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్‌లోకొచ్చి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ హౌజ్‌లో ఉన్న అఖిల్‌, అభిజిత్‌, సోహైల్‌, అరియానా, హారికను తమ మాటలు, పాటలు, డ్యాన్సులతో హుషారెత్తించారు. అయితే, మెహబూబ్‌ మాత్రం సోహైల్‌తో ఏవేవో సైగలు చేసినట్టు వీడియోలో అతని కదలికల ద్వారా తెలుస్తోంది. అందరితో మామూలుగానే జోష్‌ నింపినట్టు నటించిన మెహబూబ్‌.. తన సంజ్ఞలతో సోహైల్‌కు ఏదో చెప్పాడని మిగతా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బహుశా, సోహైల్‌ నెంబర్‌ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్‌ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్‌ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా, టాప్‌ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్‌, అభిజిత్‌, సోహైల్‌కు బిగ్‌బాస్‌ భారీ ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్‌బాస్‌ చెప్పగా.. సోహైల్‌ ఆ డీల్‌కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్‌ నుంచి బయటికొచ్చాడు. ఇక మెహబూబ్‌ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్‌ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్‌ అభిజిత్‌కు ప్రైజ్‌ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
వైరల్ అవుతున్న వీడియో కింద చూడవచ్చు 👇

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు