క‌థ వేరే ఉంట‌ది: మాస్ట‌ర్‌కు సోహైల్ వార్నింగ్‌

30 Sep, 2020 20:13 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఇంటి స‌భ్యులు అంతా సోహైల్ మీద ప‌డిన‌ట్లు అనిపిస్తోంది. నిన్న మార్నింగ్ మ‌స్తీలో దొంగ‌త‌నం ఎలా చేయాలో అత‌డు ఇంటిస‌భ్యుల‌కు నేర్పించ‌గా అంద‌రూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ త‌ర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన‌ టాస్క్‌లో అంద‌రి కాయిన్లు మాయ‌మ‌వుతుంటే దివి సోహైల్‌పై అనుమానం వ్య‌క్తం చేసింది. అత‌డే దొంగ అనేసింది. దీంతో చేయ‌ని త‌ప్పుకు దొంగ అని ముద్ర వేయ‌కంటూ అత‌డు వీరావేశానికి లోన‌య్యాడు. అరియానా, సుజాత‌తో కూడా గొడ‌వ ప‌డ్డాడు. ఈ టాస్కుకు ముందు అభిజిత్‌తోనూ ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. ఇంత‌మందితో పెట్టుకుంది చాల‌ద‌న్న‌ట్లు నేడు అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో గొడ‌వ‌కు దిగాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు మ‌ళ్లీ రావ‌డం క‌ష్ట‌మే: దేవి)

అది సోహైల్ ఊత‌ప‌ద‌మా?
"ఒక్క‌రినే టార్గెట్ చేసి ఆడితే క‌థ వేరే ఉంట‌ది" అని సోహైల్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై ఫైర్ అయ్యాడు.  దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో ఏంటి కొడ‌తావా? అని మాస్ట‌ర్ మండిప‌డ్డాడు. అయితే దివికి స‌పోర్ట్ ‌చేసే క్ర‌మంలోనే వీరి మ‌ధ్య అగ్గి రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా క‌థ వేరే ఉంట‌ది అన్న ఒక్క ప‌ద‌మే మాస్టర్‌కు మ‌హా కోపం తెప్పించిన‌ట్లు తెలుస్తోంది. కానీ సోహైల్ గ‌త ఫిజిక‌ల్ టాస్కులోనూ ఇదే డైలాగ్ వాడి రెచ్చిపోయాడుఏ. దీన్ని నాగార్జున సైతం వేలెత్తి చూప‌కుండా తేలిక‌గా తీసుకుంటూ న‌వ్వేశాడు. దీంతో సోహైల్‌కు అది ఊత‌ప‌ద‌మ‌ని ఆయ‌న అభిమానులు వెన‌కేసుకొస్తున్నారు. మాస్ట‌ర్ త‌న గేమ్ తను ఆడ‌కుండా దివిది ఎందుకు ఆడుతున్నాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రేమో ఇలాంటి ప్రోమోలు నెవ‌ర్ బిఫోర్‌.. షో చూశాక వ‌చ్చే డిస‌ప్పాయింట్‌మెంట్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. (చ‌ద‌వండి: నువ్వేం త‌క్కువ కాదు: దివిపై సోహైల్ ఫైర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు