బిగ్‌బాస్‌: గంగ‌వ్వ,‌ సుజాతల‌ కొట్లాట‌!

19 Dec, 2020 15:47 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ కంటెస్టెంట్ల త‌ల‌రాత‌ను మార్చే గ్రాండ్ ఫినాలేకు స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ టెన్ష‌న్ నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పిస్తూ, చివ‌రి సారి హౌస్‌లో స‌ర‌దాగా గ‌డిపేందుకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల‌ను లోనికి పంపించారు. వాళ్ల‌ను చూడ‌టంతోనే ఫైన‌లిస్టుల క‌ళ్లు ఆనందంతో మ‌తాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్ప‌టికే మోనాల్‌, క‌ల్యాణి, లాస్య‌, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ర‌చ్చ ర‌చ్చ చేశారు. నేడు మిగ‌తా కంటెస్టెంట్లు గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, సుజాత‌, అవినాష్‌, మెహ‌బూబ్‌, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్ట‌బోతున్నారు. ఈ క్ర‌మంలో నోయ‌ల్ త‌న ర్యాప్ సాంగ్‌తో ఫైన‌లిస్టుల్లో జోష్‌ను నింపాడు. ఇక మెహ‌బూబ్‌ను చూడ‌గానే సోహైల్ ఆనందంతో గంతులేశాడు. (చ‌ద‌వండి: నిద్ర పట్టడం లేదు అఖిల్‌.. నాక్కుడా మోనాల్‌!) 

అటు ప‌క్క మెహ‌బూబ్ మాత్రం దివితో క‌లిసి డ్యాన్స్ చేశాడు. ఈ జోడీని చూసి ఇంటి స‌భ్యులు కూడా రెట్టించిన హుషారుతో స్టెప్పులేశారు. గంగ‌వ్వ‌, సుజాత‌లు మాత్రం కాసేపు కొట్టుకున్న‌ట్లుగా న‌టించి ఆ వెంట‌నే మాస్ సాంగ్‌కు ఇర‌గ‌దీశారు. అవినాష్ తన‌కు దొరికిన కాసింత స‌మ‌యంలో కూడా కామెడీని పండించి ఆక‌ట్టుకున్నాడు. అభిని చూస్తూ బ‌య‌ట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబ‌ర్ అడుగుతున్నారు అని ఊరించి చివ‌ర్లో త‌న నెంబ‌ర్ అడుగుతున్నార‌ని పంచ్ వేశాడు. అలాగే ఈ మ‌ధ్య మొహ‌మాటం లేకుండా రెచ్చిపోయి మ‌రీ పులిహోర క‌లుపుతున్న అఖిల్ గురించి మాట్లాడ‌కుండా ఉండ‌లేక‌పోయాడు. పులిహోర చేయాలంటే ముందుగా కావాల్సింది అఖిల్ అంటూ జోకులు పేలుస్తూ అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్వించాడు. అయితే ఈ ప్రోమోలో సూర్య కిర‌ణ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దేవి నాగ‌వ‌ల్లి జాడ మాత్రం క‌నిపించ‌లేదు. మ‌రి వారు త‌ర్వాతి ప్రోమోలో అయినా క‌నిపిస్తారో లేదో చూడాలి! (చ‌ద‌వండి: బిగ్‌బాస్: గంగవ్వకు కండల వీరుడు స్పెషల్‌ గిఫ్ట్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు