రూ.50 ల‌క్ష‌లు వ‌స్తే.. : గ‌ంగ‌వ్వ‌

8 Sep, 2020 16:25 IST|Sakshi

బిగ్‌బాస్ షో ప్రారంభం అవ‌టానికి ముందు యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ కూడా కంటెస్టెంటే అని తెలిసి కొంద‌రు న‌వ్వుకున్నారు. మ‌రికొంద‌రు ఆమెతో ఏమ‌వుతుంది? అని హేళ‌న చేశారు. ఎలాగోలా అవ్వ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. కానీ హ్యాండ్స‌మ్ అబ్బాయిల‌ను, హాట్ అమ్మాయిల‌ను వెన‌క్కునెట్టి గంగ‌వ్వే పాపుల‌ర్ అవుతోంది. నిన్న‌టి ఒక్క ఎపిసోడ్‌తోనే అవ్వ‌కు ఆర్మీ కూడా త‌యారైంది. అయితే ఆమె పోటీ ఇస్తుంద‌ని ముందుగానే అంచనా వేశారో ఏమో గానీ మొద‌టి వారంలోనే అంద‌రూ కలిసి ఆమెను ఎలిమినేష‌న్ రౌండ్‌కు పంపించారు. ఆమెను పంపించేందుకు కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నా ప్రేక్ష‌కులు రెడీగా లేదు. ((చ‌ద‌వండి: గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..)

అస‌లే హౌస్‌లో చాలామందివి కొత్త ముఖాలు కాగా గంగవ్వే అంతో ఇంతో ప‌రిచ‌యం. పైగా అవ్వ ఈ వ‌య‌సులోనూ హుషారుగా ఉంటూ అంద‌రికీ పంచ్‌లు విసురుతూ త‌డాఖా చూపిస్తోంది. కాబ‌ట్టి ఇప్ప‌ట్లో గంగ‌వ్వ బిగ్‌బాస్‌ను వీడే ప్ర‌స‌క్తే లేదు. అయితే ఆమెకు షో గురించి ఇదివ‌ర‌కే తెలుసు. ఇరుగు పొరుగు ఇళ్ల‌ల్లో ఈ షోను చూసేదాన్న‌ని ఆమె చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు గంగ‌వ్వ మాట్లాడిన వీడియోను మై విలేజ్ షో తాజాగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఇందులో బిగ్‌బాస్ గురించి గంగ‌వ్వ‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపించారు. వాట‌న్నింటికీ ఆమె తాపీగా స‌మాధాన‌మిస్తూ.. "బిగ్‌బాస్ షో నాకు ముందే తెలుసు. వంట‌లు చేయ‌డం, మాట్లాడటం, గొడ‌వ‌లు పెట్టుకోవ‌డం, ఏడ్వ‌డం, ఎలిమినేష‌న్లు ఇలా ఎన్నో జ‌రుగుతాయి. గ‌త‌సారి రాహుల్ గెలిచాడు. ఇక నా విష‌యానికొస్తే కొట్లాట‌లు(టాస్క్‌లు) చేసేకాడికి చేస్తా. అయినా నాగార్జున సార్ న‌న్ను.. వాళ్ల నాన‌మ్మలాగా ఉన్న అని కొట్లాటల నుంచి త‌ప్పిస్తాడేమో! బిగ్‌బాస్ హౌస్‌లో నా వంతు క‌ష్ట‌ప‌డ‌తా. 50 ల‌క్ష‌లు వ‌స్తే ఇల్లు క‌ట్టుకుంటా. ఉన్న ఇల్లును మాత్రం షూటింగ్‌కు వాడ‌తా. ((చ‌ద‌వండి: లవకుశ నాగరాజు ఇక లేరు)

నాకు వంట రాదు కాబ‌ట్టి హౌస్‌లో బోళ్లు తోముతా.. అక్క‌డ గొడ‌వ‌లు చేస్తే నేను పెద్ద‌లాగా వ్య‌వ‌హ‌రిస్తా. ఎవ‌రిది త‌ప్పో వాళ్ల‌ని వెళ్ల‌గొడ‌దామ‌ని బ‌రాబ‌ర్ చెప్తా. బిగ్‌బాస్ హౌస్‌లో నేను చేత‌గానిదానిలాగా ఉండ‌ను. ఎంజాయ్ చేస్తా. నాలుగైదు రోజులు ఇల్లు దాటి పోలే.. కానీ ఇప్పుడు వంద రోజులు ఉంటా. ఎట్ల‌న‌న్నా గెలిచే వ‌స్తా. అందుకోసం మీరంద‌రూ ఓట్లు వేయండి. న‌న్ను గెలిపించండి" అని గంగ‌వ్వ చెప్పుకొచ్చింది. ఇప్ప‌టికే అవ్వ హుషారుకు క‌నెక్ట్ అయిన అనేక‌మంది జ‌నాలు క‌ళ్లు మూసుకుని మ‌రీ ఆమెకే ఓట్లు గుద్దుతున్నారు. దీంతో 50 శాతానికి పైగా ఓట్లు గంగ‌వ్వ‌కే ప‌డుతున్నాయి. రెండో స్థానంలో అభిజిత్ ఉండ‌గా చివ‌రి స్థానాల్లో దివి, సూర్య కిర‌ణ్ ఉన్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : బుల్లితెర హంగామా మొదలైంది)

మరిన్ని వార్తలు