బిగ్‌బాస్‌: విశ్వ‌రూపం చూపించిన గంగ‌వ్వ‌

24 Sep, 2020 15:47 IST|Sakshi

బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన‌ 'ఉక్కు హృద‌యం' టాస్క్‌లో అనేక‌ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఒక్క టాస్క్ ఇంటి స‌భ్యుల మాస్క్‌ల‌ను తీసివేయ‌డంతో పాటు ఇంటిని నిప్పుల గుండంగా మార్చింది. దివిని కిడ్నాప్ చేసినందుకుగానూ అభిని 'నువ్వు మగాడివేనారా? థూ' అంటూ మ‌నుషుల టీమ్ స‌హ‌నం కోల్పోయి అత‌డిని అన‌రాని మాట‌లు అన్నారు. దీంతో ఆ బూతుల‌ను త‌ట్టుకోలేక అభి 'మీకు కోప‌ముంటే న‌న్ను నామమినేట్  చేసేయండి" అని ఒక్క మాట చెప్పి గొడ‌వ‌ను అక్క‌డితో ఆపేశాడు. నేడు కూడా కొన‌సాగ‌నున్న ఈ టాస్క్‌లో .. ఒళ్లు తెలీకుండా సోఫాలో సెటిలైన మాస్ట‌ర్‌తో రోబో అవినాష్ క‌బుర్లు చెప్తూ చార్జింగ్ పెట్టుకున్నాడు. మాస్ట‌ర్ పెద్ద ప్లేయ‌ర్ అనుకున్నామే.. అని త‌ప్పులో కాలేశామ‌ని  గ్ర‌హించి మెహ‌బూబ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు.

తాజాగా రిలీజ్ చేసిన మ‌రో ప్రోమోలో గంగ‌వ్వ త‌న విశ్వ‌రూపం చూపించింది. అస‌లే అమ్మాయిల‌ను దుప్ప‌టి అడ్డం పెట్టి గార్డెన్ ఏరియాలోనే వాష్‌రూమ్‌కు పోనిచ్చినందుకు మ‌నుషుల టీమ్‌లోని అబ్బాయిల‌పై ఆమె ఇదివ‌ర‌కే చాలా సీరియ‌స్ అయింది. చేసిన ఘ‌న‌కార్యానికి ఇంకా గొంతు లేపి మాట్లాడుతున్నారా? అని వాళ్ల‌ నోరు మూయించింది. నేటి ఎపిసోడ్‌లో ఐతే ఏకంగా చేయి చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది ఇంట్లో నీళ్లు రాకుండా స్విచ్ ఆఫ్ చేసినందుకు మోనాల్‌పై అరియానా, గంగ‌వ్వ ఒంటికాలిపై లేచారు. మోనాల్‌, అరియానా కొట్టుకు చ‌స్తుంటే రోబోలు నిర్ఘాంత‌పోయారు. (చ‌ద‌వండి: అతి త్వ‌ర‌లోనే మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ)

మోనాల్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన గంగ‌వ్వ.. ఆమెపై త‌న ప్ర‌తాపం చూపిస్తూ కుర్చీ విసిరి పారేసింది. ఈ వీడియోను చూసిన నెటిన్లు 'రోబోల‌కు ఎమోష‌న్స్ ఉండ‌కూడ‌దు క‌దా!' అని లాజిక్ మాట్లాడుతున్నారు. 'సోహైల్ అరిస్తే త‌ప్పు అని వారించిన‌ప్పుడు గంగ‌వ్వ చేస్తుందేంటి?' అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే కావాల‌నే అభిజిత్ గంగ‌వ్వ‌ను బ‌లి చేస్తుడేమోన‌ని మ‌రికొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 'మ‌రేం ప‌ర్లేదు, శ‌నివారం నాడు నాగార్జున వ‌చ్చి అంద‌రికీ గడ్డి పెడ‌తాడ‌ని, అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేద్దాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చ‌ద‌వండి: ఒక‌రిని కిడ్నాప్ చేసి మిగ‌తా వారిని వ‌దిలేశారు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు