షాకింగ్‌: బిగ్‌బాస్‌కు గంగ‌వ్వ గుడ్‌బై!

10 Oct, 2020 15:28 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో గంగ‌వ్వ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. షో ప్రారంభ‌మైన కొత్త‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌ధానంగా ఆమె పైనే ప్రోమోలు వ‌చ్చేవి. ఆమె హుషారు, ఆమె వేసే పంచులు షో నీర‌సంగా సాగ‌కుండా, ఫుల్ జోష్‌తో కొన‌సాగేందుకు కార‌ణ‌మ‌య్యేవి. అయితే ఆమ‌ధ్య త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇంటికి వెళ్లిపోతాన‌ని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్ ఆమెను పంపించేందుకు సుముఖత వ్య‌క్తం చేయ‌లేదు. అందుకు బ‌దులుగా ఆమెకు వైద్యం చేయించి మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆమె తిరిగి కోలుకొని ఎప్ప‌టిలాగే హుషారుగా క‌నిపించ‌డంతో ఇప్ప‌ట్లో అవ్వ బ‌య‌ట‌కు వెళ్ల‌ద‌ని అంద‌రూ డిసైడ్ అయ్యారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌లో ఆ న‌వ్వు దూరం కానుందా?)

ముద్ద దిగ‌డం లేద‌ని బాధ‌ప‌డ్డ గంగ‌వ్వ‌
కానీ నిన్న‌టి ఎపిసోడ్‌లో ఆమెకు మ‌ళ్లీ ఇంటిపై ప్రాణం కొట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని వాపోయింది. క‌డుపు నిండా తినే త‌న‌కు ఇక్క‌డ పిడికెడు ముద్ద కూడా లోప‌లికి వెళ్ల‌ట్లేద‌ని భోరుమ‌ని ఏడిచింది. కానీ బిగ్‌బాస్ ఈసారి ఆమె వేద‌న‌ను అర్థం చేసుకోకుండా క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అవ్వ మొర‌ను ఆల‌కించి ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బ‌య‌ట‌కు పంపించేసిన‌ట్లు స‌మాచారం. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఆమెను షో నుంచి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: గంగ‌వ్వ వ‌ల్ల ఆట దెబ్బ‌తింటోందా?)

అవ్వ వెళ్లిపోతే అఖిల్ ప‌రిస్థితి?
ఈ వార్త‌ విన్న‌ గంగ‌వ్వ అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఇక‌ అవ్వ వెళ్లిపోతే ఎక్కువగా బాధ‌ప‌డేది అఖిల్‌. తాను అవ్వను త‌ప్ప ఎవ్వ‌రినీ న‌మ్మ‌ట్లేద‌ని నిన్న‌నే అఖిల్ మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. ఇంత‌లోనే గంగ‌వ్వ వెళ్లిపోతుండ‌టం అత‌డికి భారంగానే మార‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. కాగా ఇప్ప‌టినుంచైనా కంటెస్టెంట్లు సానుభూతి కార్డు ప్లే చేయ‌కుండా ఆడ‌తార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గంగ‌వ్వ అభిమానులు మాత్రం రేప‌టి నుంచి అవ్వ లేకుండా షో ఎలా చూడ‌గ‌ల‌మ‌ని బాధ‌లో కూరుకుపోయారు. (చ‌ద‌వండి: బిడ్డ శ‌వం భుజానేసుకుని వెళ్లాను: గ‌ంగ‌వ్వ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు