బిగ్‌బాస్‌: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ

2 Oct, 2020 22:55 IST|Sakshi

ఐపీఎల్‌, కరోనాను ఎదుర్కొని ప్రేక్షకులకు బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. టాస్క్‌లు, ట్విస్టులు, నామినేషన్‌లు, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో భారీ స్థాయిలో వినోదాన్ని పంచుతోంది. ఇక బిగ్‌బాస్‌ ఇంటి హౌజ్‌లో 26వ రోజు సందడి సందడిగా సాగింది. ఉదయాన్నే హుషారైన పాటకు అందరూ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌లు చేశారు. మార్నింగ్‌ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరికి మెహబూబ్‌‌ డ్యాన్స్‌ స్టెప్పులు నేర్పిస్తున్నాడు. ఇంటి సభ్యుల్లో కొంతమందికి మాత్రమే లగ్జరీ బడ్జెట్‌ లభించింది. ష్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌లతో అలరించారు. ఇంకేం జరిగిందంటే.. 

చపాతి స్టెప్‌ చేసిన మెహబూబ్‌
లాస్య ఎక్కువగా కిచెన్‌ వర్క్‌ చేస్తుంటుంది. కిచెన్‌లో ఆమె చేసే చపాతిని డ్యాన్స్‌ రూపంలో చేసి చూపించాడు మెహబూబ్‌. అవినాష్‌ కాలుకు దెబ్బ తగలడంతో కాలు కదలకుండా, అఖిల్‌ లాగా వర్కౌట్స్‌ ఎలా చేయాలో డ్యాన్స్‌ చేయాలో చేసి చూపించాడు. వీటితోపాటు ఇంట్లో కోపిష్టిగా పేరు తెచ్చుకున్న సోహైల్‌ ఆగ్రహంతో ఏ విధంగా డ్యాన్స్‌లు చేయాలో చూపించాడు. మాస్టర్‌తో కలిసి కాంచనలా మారి స్టెప్పులు వేశాడు. గంగవ్వ, స్వాతి, కుమార్‌ సాయి.. ఇలా ఇంట్లోని వారందరితోనూ ఏదో ఒక విధంగా డ్యాన్స్‌ చేపించాడు. అవినాష్‌ తనలోని మిమిక్రీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌‌ను మిమిక్రీ చేసి చూపించాడు. చదవండి : ‌అఖిల్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ ఏంటి?

కన్ఫెషన్‌ రూమ్‌లోకి అఖిల్‌
ఇంటి సభ్యులంతా హాల్‌లో కూర్చొని ఉండగా అఖిల్‌ను బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిపించాడు. ఆ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్‌ మిగతా ఇంటి సభ్యులకు కనిపించనున్నాడు. ఈ వారం రేషన్‌ మేనేజర్‌గా అఖిల్‌ ఎన్నికైనందున అతనికి లగ్జరీ బడ్జెట్‌ షాపింగ్‌ చేయాలి. లగ్జరీ బడ్జెట్‌ సామాన్ల లిస్ట్‌ను అందించి, తమ దగ్గర ఉన్న 3200 పాయింట్లో ఒక్కొక్కరికి ఒక్కో వస్తువు చొప్పున16 ఎంపిక చేయాలి. లాస్యకు చికెన్‌ పచ్చడి, నోయల్‌కు బ్రెడ్‌, నూడుల్స్‌ సోహైల్‌, పోహ మెహబూబ్‌, పన్నీర్‌ మోనాల్‌, మాస్టర్‌కు శనగపిండి, కార్నఫ్లెక్స్‌ గంగవ్వకు కేటాయించాడు. కన్ఫేషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చాక తమకు ఏ వస్తువులు రాని ఇంటి సభ్యులు కొంత నిరాశ చెందాడు. అఖిల్‌ వేరే విధంగా ప్లాన్‌ చేసి ఉంటే బాగుండని అనుకున్నారు. చదవండి : బిగ్‌బాస్‌: అదిరేటి డ్రెస్‌ మేమేస్తే..

పిచ్చెక్కించిన ఫ్యాషన్‌ షో
ఇంట్లోని సభ్యులందరికి కొత్త బట్టలు వచ్చాయి. చందన బ్రదర్స్‌ పంపించిన దుస్తులను ధరించి అందంగా తయారు అవ్వాలి. అనంతరం చందన బ్రదర్స్‌ ఫ్యాషన్‌ టాస్క్‌ చేయాలి. ఈ టాస్క్‌లో ర్యాంప్‌ వాక్‌ చేయాలి. ఇందులో మంచిగా చేసిన ఒక అబ్బాయి, అమ్మాయిని విజేతగా ప్రకటించి వారికి లక్ష రూపాయల గిఫ్ట్‌ వోచర్‌ను అందించాలి. ర్యాంప్‌ వాక్‌లో అబ్బాయిలందరూ ఒక్కొక్కరూ వచ్చి తమదైన స్టైల్లో వాక్‌ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలందరూ అందంగా ర్యాంప్‌ వాక్‌ చేసి అబ్బాయిల గుండెల్లో మంటలు రేపారు. కుందనపు బొమ్మలా కనిపించారు. అమ్మాయిల నుంచి గంగవ్వను ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించగా..అవ్వకు లక్ష రూపాయల గిఫ్ట్‌ వోచర్‌ అందించారు. అబ్బాయిల నుంచి అవినాష్‌ను విజేతగా తెలిపారు. బిగ్‌బాస్‌: అదిరేటి డ్రెస్‌ మేమేస్తే..

అద్దంలా మారిన అవినాష్‌
ఇంట్లోని అమ్మాయిలకు అందంగా తయారు అవ్వడం మహా ఇష్టం. ఈ క్రమంలో అవినాష్‌ అమ్మాయిలకు అద్దంగా వ్యవహరించనున్నాడు. ప్రతి అమ్మాయి అద్దం(అవినాష్‌) ముందుకు వచ్చి తమ మనసులోని ఫీలింగ్స్‌ను చెప్పుకోవాలి. ఇందులో అవినాష్‌ తన దగ్గరకు వచ్చిన వారిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆటాడుకున్నాడు. వాళ్లపై పంచ్‌లు వేస్తూ వారిని సరదాగా అలరించాడు. చివరగా ర్యాంప్‌ వాక్‌ షో లో ఎవరూ ఎలా చేశారో ఇమిటెట్‌ చేసి చూపించారు. అయితే సుజాత బుంగమూతి పెట్టుకుని అలిగింది. ఈ నెపంతో లాస్య, సుజాతకు మధ్య చిన్నగా వివాదం మొదలైంది. విన్నర్‌గా ముందు నోయల్‌ను చెప్పి ఆ తరువాత అవినాష్‌ను ప్రకటించినదని లాస్య సుజాత మధ్య గొడవ అయ్యింది.  తర్వాత అవినాష్‌ సుజాతను కూల్‌ చేశాడు. అంతేగాక తనకు నచ్చినట్లు ఆడి బిగ్‌బాస్‌లో  ఉండాలని, ఇతరులను బతిమాలడం మానేయాలని అరియానా అవినాష్‌లో స్పూర్తిని నింపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు