బిగ్‌బాస్‌ హౌస్‌లో చెల‌రేగిపోయిన రాక్ష‌సులు

20 Oct, 2020 17:58 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఎప్ప‌టిలాగే ఇంటిస‌భ్యుల‌కు బిగ్‌బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అందులో భాగంగా అభిజిత్‌, మాస్ట‌ర్‌, మోనాల్‌, దివి, సోహైల్, లాస్య, నోయ‌ల్ మంచి మ‌నుషులుగా, మిగ‌తావాళ్లు రాక్ష‌సులుగా అవ‌తారాలెత్తారు. వ‌స్తువుల‌ను విసిరేస్తూ, దుస్తుల‌ను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేస్తూ క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనేది వారికి ఈ అసురులు రుచి చూపిస్తున్నారు. వాళ్ల‌ను చిత్ర‌విచిత్రంగా వేధిస్తూ, ఇంటిని మొత్తం చింద‌ర‌వంద‌ర చేస్తూ స‌‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారు. (చ‌ద‌వండి: నాన్న ఇస్త్రీ ప‌ని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్‌: నోయ‌ల్)

క‌సితో, ప‌గ‌తో ర‌గిలిపోతున్నాన‌ని ముక్కు అవినాష్‌ను మంచి మ‌నిషిగా ఉన్న మోనాల్ ఒక్క‌సారిగా హ‌త్తుకోవ‌డంతో షాక‌య్యాడు మంచికి చెడుకు మ‌ధ్య జ‌రుగుతున్న ఈ టాస్క్‌లో ఎవ‌రు ఎవ‌రిని చేంజ్ చేస్తారంటూ స్టార్ మా తాజాగా ప్రోమోను వ‌దిలింది. మ‌రి ఈ టాస్కులో రాక్ష‌సులు పెడుతున్న క‌ష్టాల‌ను నుంచి మ‌నుషుల టీమ్ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే రాక్ష‌సుల‌ను మంచి మ‌నుషులుగా మార్చేందుకు బిగ్‌బాస్ టాస్కులు ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఈ అవ‌కాశాన్ని మంచి మ‌నుషులు ఏమేర‌కు స‌ద్వినియోగం చేసుకుంటార‌నేది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. (చ‌ద‌వండి: నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు