బిగ్‌బాస్‌: ఈ కొరుక్కోవ‌డ‌మేంట్రా నాయ‌నా!

28 Oct, 2020 18:17 IST|Sakshi

పిల్ల‌లు దైవస‌మానం అంటారు. కానీ పిల్ల‌ల్లా అవ‌తార‌మెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్ష‌సుల్లా మారిపోయి హౌస్‌లో అరాచ‌కం సృష్టిస్తున్నారు. కేర్ టేక‌ర్లను బెంబేలెత్తిస్తున్నారు. త‌న‌ను నామినేట్ చేశాడ‌న్న కోపంతోనో ఏమోకానీ అరియానా.. సోహైల్‌కు న‌ర‌కం అంటే ఏంటో చూపిస్తోంది. అత‌డు కూడా నామినేట్ చేసిన పాపానికి ఎంత టార్చ‌ర్ పెట్టినా న‌వ్వుతూనే భ‌రిస్తున్నాడు. అటు అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు అభిజిత్ డైప‌ర్ తొడ‌గాల్సిన దుస్థితి వ‌చ్చింది. కండ‌ల వీరుడు మెహ‌బూబ్‌ను అఖిల్ చ‌చ్చిన‌ట్లు ఎత్తుకుని తిప్ప‌క త‌ప్ప‌లేదు. (బిగ్‌బాస్‌: అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్)

సోహైల్‌కు డ‌బుల్ టార్చ‌ర్‌
ఈ టాస్క్‌లో అవినాష్ అరియానాతోనే ఎక్కువ సేపు ఉంటున్నాడు. దీంతో వాళ్లిద్ద‌రినీ వీపు మీద‌ ఎక్కించుకుని తిప్పుతూ సోహైల్ తెగ అవ‌స్థ ప‌డుతున్నాడు. అలాగే లాస్య‌తో క‌లిసి అరియానాకు చుక్‌చుక్ బుండి వ‌స్తుంది అంటూ ప‌ద్యం నేర్పిస్తుంటే వెన‌క నుంచి మాస్ట‌ర్ అత‌డి చొక్కా మీద పిచ్చి గీత‌లు గీశాడు. మ‌రోవైపు హారిక కొంటె పిల్ల‌గా మారి తోటి పిల్ల‌ల పెన్సుళ్లు కొట్టేస్తోంది. మాస్ట‌ర్‌ను గిచ్చుతూ, గిల్లుతూ ఏడిపిస్తోంది. దీంతో హారిక‌ను మాస్ట‌ర్ వ‌చ్చి చెంప మీద కొట్టాడు. దీంతో దెబ్బ‌కు దెబ్బ తీయాల‌ని ప‌రుగెత్తుకుంటూ వెళ్లిన హారిక అత‌డికి రెండు త‌గిలించింది. దీంతో మాస్ట‌ర్‌ హారిక‌ను కొరకగా ప్ర‌తీకారంగా ఆమె అత‌డిని కొరికింది. ఇలా కాసేప‌టివ‌ర‌కు ఇద్ద‌రూ దెబ్బ‌లాడుకున్నారు. దీంతో అభి వ‌చ్చి హారిక‌ను మెంట‌ల్ అనేశాడు. (ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించిన అరియానా)

అభికి ద‌గ్గ‌ర‌య్యేది ఎవ‌రు?
ఈ అన్‌సీన్ వీడియోను చూసిన‌ నెటిజ‌న్లు ఈ కొరుక్కోవ‌డ‌మేంట్రా నాయ‌నా అని త‌ల‌లు పట్టుకుంటున్నారు. టాస్క్ ముగిసే స‌మ‌యానికి కేర్ టేక‌ర్ల‌ను బ‌తకనిచ్చేలా లేర‌ని కామెంట్లు చేస్తున్నారు. కాగా నేటి ఎపిసోడ్‌లో వింత‌లు చోటు చేసుకోనున్నాయి. ఎప్పుడూ హారిక‌ను నిందించ‌ని అభిజిత్ ఆమెపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య వైరం పెర‌గ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఇప్ప‌టికే పెరిగిన దూరాన్ని త‌గ్గించుకుని అభితో క్లోజ్ అయ్యేందుకు మోనాల్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఆమెతో కూర్చుని ఇప్ప‌టివ‌ర‌కు తలెత్తిన బేధాభిప్రాయాల‌ను సెటిల్ చేసుకునేందుకు అభి ఓకే చెప్ప‌డం విశేషం. మ‌రి నేటి ఎపిసోడ్‌లో అభికి ఎవ‌రు ద‌గ్గ‌ర కానున్నారు? ఎవ‌రు దూర‌మ‌వ‌నున్నారు? అనేది తెలియాలంటే ఇంకొద్ది గంట‌లు వేచి ఆగాల్సిందే! (బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశ‌ల్)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు