బిగ్‌బాస్: చిన్న ప్యాకెట్ పెద్ద ధ‌మాకా!

17 Dec, 2020 19:19 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ అంతిమ‌ ఘ‌ట్టానికి చేరుకుంది. ఈ క్ర‌మంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ప్ర‌యాణాన్ని వారి క‌ళ్ల‌ముందుంచుతూ ఎమోష‌న‌ల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే అఖిల్‌, అభిజిత్ వారి జ‌ర్నీ వీడియోలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ సంద‌ర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. విన్న‌ర్ అయ్యేది తానేనంటూ విశ్వాసం క‌న‌బ‌రిచాడు. త‌ర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు రావ‌డమే త‌ను తీసుకున్న‌ గొప్ప నిర్ణ‌యమ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అటు బిగ్‌బాస్ కూడా అభి లాంటి తెలివైన కంటెస్టెంటు హౌస్‌లో ఉండ‌టం బిగ్‌బాస్‌కే గ‌ర్వ‌కార‌ణం అని చెప్ప‌డం విశేషం. అయితే వీరి ఇద్ద‌రి వీడియోల‌లో మోనాల్ ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అంటే బిగ్‌బాస్ ఎడిట‌ర్లు ట్ర‌యాంగిల్ స్టోరీ మీద‌నే పెద్ద‌గా ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. అభిజిత్ జ‌ర్నీ వీడియోలో హారిక‌తో గ‌డిపిన క్ష‌ణాలు త‌క్కువ‌గా చూపించారు. నోయ‌ల్‌, లాస్యల‌కు కూడా పెద్ద‌గా స్థానాన్ని క‌ల్పించ‌లేదు. దీంతో మిస్ట‌ర్ కూల్‌ అభిమానులు కొంత నిరుత్సాహానికి లోన‌య్యారు. (చ‌ద‌వండి: ఆ పాట పాడుతూ ప్ర‌పోజ్ చేయాలి: మోనాల్‌)

నేడు మిగిలిన ముగ్గురికి బిగ్‌బాస్ హౌస్‌లో వారి మ‌జిలీని చూపించ‌నున్నాడు. ఈ క్ర‌మంలో ఇంట్లో అడుగు పెట్టిన క్ష‌ణం నుంచే ఆమె ఒక సంచ‌ల‌నం అంటూ బిగ్‌బాస్‌ అరియానాను ప్ర‌శంసించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధ‌మాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ హారిక ఫైన‌లిస్టుగా నిలిచింద‌ని ఆమెను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయాడు. మీరు ప‌డ్డ‌ ప్ర‌తిభ‌, శ్ర‌మ‌కు ఇక‌పై మీ క‌థ వేరేలా ఉంటుందంటూ సోహైల్‌ను పొగిడాడు. ఓవైపు 100 రోజుల జ‌ర్నీ, మ‌రోవైపు బిగ్‌బాస్ చూపిస్తున్న ప్రేమ‌తో  ఇంటి స‌భ్యులు భావోద్వేగానికి లోన‌య్యారు. ఇలాంటి మ‌ధుర క్ష‌ణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని త‌లుచుకుని లోలోప‌లే కొంత బాధ‌ప‌డుతున్నా పైకి మాత్రం ఆనంద భాష్పాలు కారుస్తున్నారు. వీరి సంతోషాన్ని, జ‌ర్నీ వీడియోను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వ‌చ్చేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నెట్టింట‌ అభి, హారిక ఫ్యాన్స్ ఫైట్‌)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు