బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే‌: హారిక అవుట్‌!?

19 Dec, 2020 20:50 IST|Sakshi

దేత్త‌డికి అత్య‌ల్ప ఓట్లు

ట్రోఫీ రేసు నుంచి త‌ప్పుకున్న హారిక‌

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ ద‌క్కించుకునేందుకు 19 మంది కంటెస్టెంట్లు పోరాడారు. ఈ పోరాటంలో తుది వ‌ర‌కు నిలిచిన‌ అరియానా, సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌, హారిక ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురి మ‌ధ్య జ‌రుగుతున్న ఓట్ల యుద్ధంలో గెలుపు ఒక్క‌రినే వ‌రించ‌నుంది. ఆ విజేత‌ ఎవ‌ర‌నేది రేపు తేల‌నుంది. ఈ గ్రాండ్ ఫినాలేను ప్రీమియ‌ర్ ఎపిసోడ్ కంటే వైభ‌వంగా నిర్వ‌హించేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు చేశారు. హీరోయిన్ల డ్యాన్సులు, త‌మ‌న్ లాంటి గొప్ప‌ సింగ‌ర్ల పాట‌లతో షోను గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. దీనికితోడు మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సుల‌తో ఫినాలే మ‌రింత వినోదాత్మ‌కంగా సాగ‌నుంది. ముఖ్యంగా అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న‌ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ ర‌స‌వత్త‌రంగా మార‌నుంది. (చ‌ద‌వండి: హారిక హ‌గ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్‌)

అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. దేత్త‌డి హారిక‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఫైన‌ల్ ఎలిమినేష‌న్‌లో హారిక‌ హౌస్‌లో నుంచి వెళ్లిపోనున్న మొద‌టి కంటెస్టెంటుగా నిల‌వ‌నుంది. అరియానా, సోహైల్‌, అభిజిత్‌, అఖిల్.. ట్రోఫీ కోసం పోటీప‌డ‌నున్నారు. అన‌ధికారిక పోల్స్ ప్ర‌కారం ఓట్ల సంఖ్య‌లో అఖిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సోహైల్‌, అరియానాలు రెండో స్థానం కోసం పోటీప‌డుతున్నారు. అభిజిత్ తొలి స్థానంలో నిలుస్తూ వ‌స్తున్నాడు. అయితే హాట్‌స్టార్ ఓట్లు అంద‌రూ వేస్తారు, కానీ మిస్‌డ్ కాల్స్ కూడా చేసే ఓపిక చాలా త‌క్కువ మందికే ఉంటుంది. ఈ మిస్‌డ్ కాల్స్ ఓట్లే విన్న‌ర్‌, ర‌న్న‌ర్‌ను డిసైడ్ చేయ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. కాబ‌ట్టి ఈ అన‌ఫీషియ‌ల్ పోల్స్ చెప్తున్న‌ట్లుగా రేపు అభిజిత్‌నే విన్న‌ర్‌ను ప్ర‌క‌టిస్తార‌నేది క‌చ్చితంగా చెప్ప‌లేం. ఇక‌ ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేపు సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. అప్పుడే నాగార్జునతోపాటు ప్ర‌త్యేక అతిథులు విజేత‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. అప్ప‌టివ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. (చ‌ద‌వండి: నువ్వు ఫేక్‌, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్‌‌)

Poll
Loading...
మరిన్ని వార్తలు