నామినేష‌న్స్‌:‌ హారిక వ‌ల్ల మోనాల్ బ‌లి కానుందా?

23 Nov, 2020 19:18 IST|Sakshi

బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు వ‌చ్చే కొద్దీ ఇంట్లో లెక్క‌లు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘ‌ట్టం నుంచి అఖిల్ గ్రాఫ్ పడిపోతూ వ‌స్తుండ‌గా సోహైల్‌కు ఉన్న ఆద‌ర‌ణ రెట్టింపు అవుతోంది. కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ కూడా ఇదే విష‌యాన్ని తేల్చి చెప్పాయి. అభిజిత్‌, సోహైల్ టాప్ 5లో ఉండ‌టం ఖాయ‌మ‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పాయి. ఆఖ‌రికి అఖిల్ అన్న బ‌బ్లూ కూడా టాప్ 5లో ఎవ‌రుంటార‌న్న ప్ర‌శ్న‌కు మొద‌ట సోహైల్ పేరే చెప్పి సొంత త‌మ్ముడు అఖిల్‌కు షాకిచ్చాడు. అటు మోనాల్ త‌ల్లి.. అభిజిత్ త‌న‌కు న‌చ్చే కంటెస్టెంట్ అని చెప్పి అఖిల్‌కు షాకిచ్చింది. అభిజిత్ తండ్రి మాత్రం కోపాన్ని త‌గ్గించుకుంటేనే టాప్ 2లో ఉంటావ‌ని అఖిల్‌కు విలువైన సూచ‌న అందించాడు. మొత్తానికి టాప్ 2లో ఉంటాడ‌నుకున్న అఖిల్ త‌న గొయ్యి తానే త‌వ్వుకుంటూ విజేత అయ్యే అవ‌కాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నాడు.

గుడ్లు బ‌య‌ట‌కు తీసి బెదిరిస్తోన్న అఖిల్‌
త‌నకు ఎవ‌రి స‌పోర్ట్ లేద‌ని ఎప్పుడూ చెప్పే అఖిల్ మాట నేడు మ‌రోసారి నిజ‌మ‌వుతోంది. నామినేష‌న్‌లోకి వెళ్లిన అఖిల్ త‌న కోసం త్యాగం చేయ‌మ‌ని మోనాల్‌ను కోర‌గా ఆమె అంగీక‌రించ‌లేదు. రెండు సార్లు త‌న‌ను నామినేష‌న్‌లోకి పంపిన అఖిల్ కోసం ఆమె డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్లడానికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే ప్రోమోలో మాత్రం అభిజిత్‌తో స్వాప్ చేసుకుని మోనాల్ నామినేష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు చూపించారు. దీంతో అఖిల్ కోపంగా గుడ్లు బ‌య‌ట‌కు తీసి మోనాల్‌ను మింగేసేలా చూస్తున్నాడు. ఈ ప్రోమోను చూసిన‌ నెటిజ‌న్లు మోనాల్ గురించి చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. (చ‌ద‌వండి: అభికి లేరెవ‌రూ పోటీ.. ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌..)

నిజంగానే మోనాల్ అఖిల్‌కు మోసం చేసిందా?
ఇన్ని రోజులు అఖిల్‌తో ఉండి, అత‌డి అభిమానులు వేసిన ఓట్ల వ‌ల్లే ఇంకా హౌస్‌లో ఉండ‌గ‌లిగిన ఆమె అత‌డిని మోసం చేసింద‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అభి పాపులారిటీ తెలుసుకుని అత‌డి కోసం త్యాగం చేసి హౌస్‌లో త‌న స్థానాన్ని ప‌దిలంగా కాపాడుకునే ప్ర‌య‌త్న‌మ‌ని కామెంట్లు చేస్తున్నారు. కానీ మోనాల్ త‌నంత‌ట తానుగా వెళ్లి అభి కోసం త్యాగం చేసే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న‌ ఇంట్లో ఎవ‌రిని న‌మ్మ‌కుండా ఉంటే బాగుండేది అని నాగ్ అడిగిన‌ప్పుడు ఆమె మ‌రో ఆలోచ‌నే లేకుండా అభిజిత్ పేరు చెప్పింది. అలాంటిది అఖిల్‌ను కాద‌ని అభి కోసం త్యాగం చేయ‌డంలో అర్థం లేన‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: మెహ‌బూబ్‌ బ‌దులు మోనాల్ వెళ్లిపోవాల్సింది: అభి)

సాయం చేసిన మోనాల్‌కు హారిక వెన్నుపోటు!
కేవ‌లం హారిక త‌న కెప్టెన్సీ ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి అభిని కాపాడి, అత‌ని స్థానంలోకి మోనాల్‌ను పంపించినట్లుగా క‌నిపిస్తోంది. అదే నిజ‌మైతే హారిక ఇబ్బందుల్లో ప‌డ‌టం ఖాయం. కెప్టెన్ అవ్వాల‌న్న ఆమె క‌ల‌ను నిజం చేసిన మోనాల్‌ను నామినేష‌న్‌లోకి పంపిస్తే హారిక ఇమేజీ డ్యామేజీ అవుతుందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టాప్ 5కు చేరుకునేందుకు కీల‌క‌మైన ఈ రెండు వారాల్లో త‌న స్నేహితుడైన అభిని ర‌క్షించుకోవ‌డంలో త‌ప్పేమీ లేద‌ని అభిక ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా మోనాల్ నామినేష‌న్ ఆస‌క్తిక‌రంగా మార‌గా.. ఈ వారం అఖిల్ - మోనాల్, అవినాష్‌- అరియానా జంట‌లు నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు