బిగ్‌బాస్‌: అభిని నామినేట్ చేసిన హారిక‌

30 Nov, 2020 15:59 IST|Sakshi

అఖిల్‌ను నామినేట్ చేసిన మోనాల్‌

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు మ‌రో మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో కంటెస్టెంట్లు పోటీని తట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా నామినేష‌న్ అనే సంద్రాన్ని ఈదాల్సి ఉంటుంది. ఈ రోజు ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. ప‌ద‌మూడో వారానికిగా గానూ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో జంట ప‌క్షులు విడిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టి నుంచి త‌న గేమ్ ఆడ‌తాన‌ని చెప్పిన మోనాల్ అన్నంత‌ప‌నే చేసింది. కానీ మొద‌టి నుంచి ఆమెకు నీడ‌లా తోడున్న అఖిల్‌ను నామినేట్ చేసి అంద‌రికీ షాకిచ్చింది. క‌ల‌లో కూడా ఊహించ‌ని ఈ ప‌రిణామానికి అఖిల్ ఆగ్ర‌హానికి లోన‌య్యాడు. నీకోసం ఎంతో కొట్లాడాను,.. చివ‌రికి ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర న‌న్ను బ్యాడ్ చేయాల‌నుకుంటున్నావు, అంతే క‌దా! అని మండిప‌డ్డాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నాగ్‌పై అభిజిత్ ఫ్యాన్స్‌ ఫైర్)

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ నీకే ఎక్కువ‌
అటు అవినాష్‌, అఖిల్ కూడా ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో అవినాష్ నాక‌న్నా వీక్ ఉన్న‌వాళ్లు కూడా ఉన్నారు. నేనెందుకు ఎలిమినేట్ అవ్వాలని ఫ్ర‌స్టేట్ అయ్యాడు. అది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని అఖిల్ అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రి అఖిలే నెంబ‌ర్ 1 అని నువ్వు అనుకోవ‌డం ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కాదా? అని అవినాష్‌ ఎదురు ప్ర‌శ్నించాడు. అస‌లు మొద‌టి నుంచి అరియానాకు, మోనాల్‌కు ప‌డద‌న్న విష‌యం ఈ నామినేష‌న్‌తో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఈ ఇద్ద‌రూ మాట‌ల తూటాలు పేల్చుకుంటుండ‌గా తెలుగులో మాట్లాడ‌మని అవినాష్ స‌ల‌హా ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన మోనాల్ మ‌ధ్య‌లోకి రావ‌ద్ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఇంట తీవ్ర‌ విషాదం )

నువ్వు కూడా అర్థం చేసుకోలేదా..
అన్నింటికీ మించి ప్రోమోలో అత్యంత ఆస‌క్తి రేకెత్తించిన అంశం హారిక అభిజిత్‌ను నామినేట్ చేయ‌డం! ఫేవరెటిజ‌మ్ చూపించ‌కుండా సొంతంగా గేమ్ ఆడంటూ నాగార్జున ఆమెకు క్లాస్ పీకిన విష‌యం తెలిసిందే క‌దా! దీంతో గ‌త‌వారంలో టాస్క్ ఆడ‌ని త‌న క్లోజ్ ఫ్రెండ్ అభిని ఆమె నామినేట్ చేస్తున్న‌ట్లుగా ప్రోమోలో చూపించారు. అయితే మ‌న‌సు వ‌ద్ద‌ని చెప్తున్నా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుని ఉండ‌వ‌చ్చ‌ని హారిక ముఖం చూస్తే అర్థ‌మ‌వుతుంది. కానీ దీనివ‌ల్ల అభి మ‌న‌సు నొచ్చుకుంది. నువ్వు అర్థం చేసుకోక‌పోతే.. ఇక్క‌డ ఇంకెవ‌రూ అర్థం చేసుకోలేరు అని  బాధ‌ప‌డ్డాడు. ఏదేమైనా బిగ్‌బాస్ విజ‌య‌వంతంగా రెండు జంట‌ల‌ను విడ‌గొట్టిన‌ట్లు సులువుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. మొత్తానికి ఈ వారం అభిజిత్‌, అఖిల్‌, మోనాల్‌, అవినాష్‌, హారిక నామినేష‌న్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. టామ్ అండ్ జెర్రీ సోహైల్‌, అరియానా మాత్రం నామినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు