బిగ్‌బాస్‌ 4 నయా రికార్డు, ఆన్‌లైన్‌లో..

6 Jan, 2021 19:14 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్‌ ఇలా అన్నీ పంచిపెట్టింది.  కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్‌బాస్‌ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 19 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్‌బాస్‌ సక్సెస్‌ఫుల్‌గా నాలుగో సీజన్‌ను పూర్తి చేసుకుంది. స్టార్‌ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా అభిజిత్‌ నిలిచాడు. ఇక అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్‌ బిగ్‌బాస్‌–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్‌ సార్థక్‌ రన్నరప్‌గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్‌, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. చదవండి: బంపరాఫర్‌ కొట్టేసిన అఖిల్‌.. పెద్ద సినిమాలో చాన్స్‌!

కాగా బిగ్‌బాస్‌ను ప్రేక్షకులు అమితంగా ఆదరించడంతో టీఆర్‌పీ రేటింగ్‌లోనూ ఈ షో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌లో పాత రికార్డులను తుడిచిపెడుతూ నయా రికార్డులు రాసింది. తాజాగా ఆన్‌లైన్‌ వేదికగా అత్యధిక వీక్షకాదరణ పొందిన కార్యక్రమంగా బిగ్‌బాస్‌ సీజన్‌ 4 నిలిచింది. ఈ విషయాన్ని డిస్నీ హాట్‌ స్టార్‌ నిర్వహించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే 75శాతం వీక్షకులను బిగ్‌బాస్‌ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో కార్తీక దీపం సీరియల్‌ నిలిచిందని పేర్కొంది. బిగ్‌బాస్‌ షో మొత్తంలో 86వ ఎపిసోడ్‌ అత్యధిక ఓట్ల వెల్లువ అందుకుందని వెల్లడించింది. లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి నాన్‌ మెట్రల్లో వీక్షకుల సంఖ్య 117శాతం పెరిగిందని ఈ పరిశోధన వెల్లడించింది. అలాగే తమ ప్లాట్‌ ఫామ్‌ మీద ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాగా ‘ప్రతి రోజూ పండగే’ నిలిచిందని వివరించింది. మొత్తంగా వినోద కార్యక్రమాలను వీక్షించిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. చదవండి: స్టార్‌ డైరెక్టర్‌ హామీ ఇచ్చారు: అవినాష్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు