బాయ్‌ఫ్రెండ్ సినిమాలు వ‌దులుకోమ‌న్నాడు: దివి

27 Oct, 2020 16:17 IST|Sakshi

సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందాన్ని కాపాడుకుంటూనే టాస్కుల్లో రాణించేయాల‌నే తాప‌త్ర‌యం ఉన్న దివి అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో చేసిన స్నేహ‌మే ఆమెకు శాపంగా మారింది. ఈ కార‌ణం వ‌ల్లే ఆమెకు మోనాల్ క‌న్నా త‌క్కువ ఓట్లు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. దీంతో ద‌స‌రా పండ‌గ రోజే అంద‌రి నుంచి న‌వ్వుతూనే సెల‌వు తీసుకుంది. అయితే దివి కుటుంబం, బ్రేక‌ప్ స్టోరీ గురించి మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అందులో దివి ఏమంటుందో ఆమె మాట‌ల్లోనే.... (బిగ్‌బాస్: స‌మంతే బాగా చేసింద‌ట‌)

"అమ్మ లెక్చ‌ర‌ర్‌, నాన్న హెచ్‌సీయూలో ల్యాబ్ టెక్నీషియ‌న్‌. నేను పుట్ట‌క‌ముందే హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. నేను యావ‌రేజ్‌గా చ‌దువుతాను. బీటెక్ త‌ర్వాత ఉద్యోగం చేయ‌డం ఇష్టం లేక ఎంటెక్‌లో జాయిన్ అయ్యా.. ఆ స‌మ‌యంలో నేను ర్యాంప్ వాక్ చేసి అంద‌రి క‌ళ్ల‌ల్లో ప‌డ్డాను. నా కాంటాక్ట్ లిస్ట్ పెరిగిపోయింది. అలా సినిమాల్లోకి ప్ర‌వేశించాను. నేనూ ప్రేమ‌లో ప‌డ్డాను. కానీ ఇప్పుడు ఏ రిలేష‌న్‌లో లేను. సింగిల్‌గా ఉంటేనే బెట‌ర్ అనిపిస్తోంది. అస‌లెందుకు విడిపోయామంటే.. నా బాయ్‌ఫ్రెండ్‌ వాళ్ల త‌మ్ముడు మ‌లేరియాతో చ‌నిపోయాడు. ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. న‌న్ను పల్లెటూరుకు ర‌మ్మ‌న్నాడు. చిన్న‌ప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లో పెరిగాను. ప‌ల్లెటూరు నాకు అల‌వాటు లేదు. అయినా కూడా వెళ్లొచ్చు కానీ అప్ప‌టికే మా ఇద్ద‌రికీ రెండు సంవ‌త్స‌రాలు గ్యాప్ వ‌చ్చింది. పైగా నాకెంతో ఇష్ట‌మైన మోడ‌లింగ్‌, సినిమాలు వ‌దిలేసుకోమ‌న్నాడు. దీంతో నాకు న‌చ్చింది నేను చేస్తాన‌ని ప్రేమ‌ను వ‌దిలేసుకున్నాను" అని దివి సినిమా కోసం ప్రేమ‌ను త్యాగం చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది. (దివి ఎలిమినేట్‌: సినిమా ఛాన్స్ కొట్టేసింది)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు