బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజితే‌: శ‌్రీకాంత్‌

9 Dec, 2020 17:02 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌నేది మ‌రో రెండు వారాల్లో తేల‌నుంది. ఎలాగైనా ట్రోఫీని గెలుచుకోవాల‌న్న క‌సితో ఇంటిస‌భ్యులు గేమ్‌పై ఫోక‌స్ చేస్తున్నారు. వారిని ఎలాగైనా గెలిపించాల‌న్న త‌ప‌న‌తో అభిమానులు కూడా ఓట్ల ప్ర‌చారం చేస్తున్నారు. కొంద‌రు సెల‌బ్రిటీలు సైతం వీరికి తోడుగా నిలుస్తున్నారు. అయితే ముందు నుంచీ కూడా అభిజితే గెలుస్తాడన్న బ‌ల‌మైన‌ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతూనే ఉంది.

తాజాగా హీరో శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అంద‌రి క‌న్నా అభిజిత్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడ‌ని పేర్కొన్నారు. అత‌డితో పాటు అరియానా, అఖిల్‌. సోహైల్‌, హారిక టాప్ 5లో ఉంటార‌ని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల ప్ర‌కారమైతే అభిజిత్ విన్న‌ర్ అవుతాడ‌ని అనిపిస్తోంద‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఇప్ప‌టికే నాగ‌బాబు అభిజిత్‌కు స‌పోర్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌తో పాటు కొంద‌రు జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్టులు కూడా అభికే తమ ఓట‌ని తేల్చి చెప్పారు. (చ‌ద‌వండి: రంగంలోకి దిగిన ‘నారప్ప’... టీజర్‌ అప్పుడే)

కాగా శ్రీకాంత్‌కు బిగ్‌బాస్ షో అంటే ఎంతో ఇష్టం. తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో కూడా ఈ బిగ్‌బాస్‌ను చూస్తుంటారు. గ‌తేడాది ఆయ‌న బిగ్‌బాస్ మూడో సీజ‌న్ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా వెళ్లారు. కంటెస్టెంట్ల‌తో డీల్ కుదిర్చేందుకు వెళ్లారు కానీ, ఎవ‌రూ దానికి అంగీక‌రించ‌లేదు. ఇప్పుడు నాల్గో సీజ‌న్‌ను కూడా ఆయ‌న బాగా ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: అభితో ఉండ‌ట్లేదని హారిక‌ను తిడుతున్న నెటిజ‌న్లు)

మరిన్ని వార్తలు