-

అంద‌రూ క‌లిసి అఖిల్‌ను గెంటేశారు

11 Nov, 2020 19:47 IST|Sakshi

సీక్రెట్ రూమ్‌.. బిగ్‌బాస్ ప్రేమికుల‌కు మ‌జా వ‌చ్చే టాస్క్ ఇది. లోప‌లున్న కంటెస్టెంట్ల‌కు షాకిచ్చే చ‌ర్య‌. ఎందుకంటే వారికి ఎలిమినేష‌న్ అనే చెప్తారు. కాబ‌ట్టి త‌మ‌లోంచి ఒక‌రు హౌస్‌ను వీడిపోతున్నార‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంటు వెళ్లిపోవ‌డం వ‌ల్ల టాప్ 5లో బెర్తు క‌న్ఫార్మ్ అయిన‌ట్లేన‌ని మ‌రికొంద‌రు లోలోప‌లే మురిసిపోతుంటారు. ఇక హౌస్ గేటు దాటి బ‌య‌ట‌కు వ‌చ్చిన వ్య‌క్తికి మీ ప్ర‌యాణం ముగిసిపోలేద‌ని ట్విస్ట్ ఇచ్చి అత‌డిని ఓ ర‌హస్య గ‌దిలోకి పంపి అంద‌రి ఆట‌ను క‌నిపెడుతూ, వారి మాట‌ల‌ను వినే సువ‌ర్ణావ‌కాశాన్ని క‌ల్పిస్తారు. ఇంత‌టి కీల‌క‌మైన‌ సీక్రెట్ రూమ్ స్టంట్ ఈ సీజ‌న్‌లో చ‌తికిల‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక‌వకుండా గోప్యంగా దాయడంలో బిగ్‌బాస్ టీమ్ దారుణంగా ఫెయిలైంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: సీక్రెట్ రూమ్‌లోకి అఖిల్‌!)

ఒక రోజు ముందు నుంచే అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడ‌ని సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. తాజా ప్రోమోలో అదే నిజ‌మైంది. ఇంటిస‌భ్యులంద‌రూ క‌లిసి బ‌య‌ట‌కు పంపించాల‌నుకున్న కంటెస్టెంటు పేరు చెప్ప‌మ‌ని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో దాదాపు అంద‌రూ అఖిల్ పేరు చెప్తున్న‌ట్లు క‌నిపించ‌గా సోహైల్ మాత్రం అత‌డి పేరు చెప్ప‌డానికి నిరాక‌రించాడు. ఒక్క‌రి అభిప్రాయం వేరే ఉన్నా మీరు చెప్పేది చెల్ల‌ద‌ని అఖిల్ కోసం గొడ‌కు దిగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కానీ చివర్లో మాత్రం అంద‌రూ అఖిల్‌ను ద‌గ్గ‌రుండి సాగ‌నంపారు. ఒక్క అభిజిత్ త‌ప్ప‌! అంటే.. ఇది ఫేక్ ఎలిమినేష‌న్ అని అభి ముందే ప‌సిగ‌ట్టున‌ట్లు క‌నిపిస్తోంది. మిగ‌తా కంటెస్టెంట్ల వాల‌కం చూస్తుంటే వారు కూడా ఈ ఎలిమినేష‌న్ వెన‌క ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని అనుమానిస్తున్న‌ట్లున్నారు. కానీ ఇక‌పై ఇంట్లో అఖిల్ ఉండ‌డు అని అర్థ‌మైన మోనాల్ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏదేమైనా ర‌స‌వత్త‌రంగా సాగే సీక్రెట్ టాస్క్ ఈసారి ప‌స లేకుండా పోయింది. ఇక ఈ ఫేక్ ఎలిమినేష‌న్ అంద‌రికీ తెలుస‌ని, బిగ్‌బాస్‌కే ఆల‌స్యంగా తెలిసింద‌ని నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు (చ‌ద‌వండి: త‌న‌కు హ‌గ్గులివ్వ‌డం లేద‌ని హ‌ర్టైన అభిజిత్‌)

మరిన్ని వార్తలు