‌ఐదేళ్లుగా నాన్న‌కు దూర‌మ‌య్యా: హారిక‌

15 Oct, 2020 18:56 IST|Sakshi

జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఏడ్చేసిన కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఆరో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మ‌రో కంటెస్టెంటు హౌస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇప్ప‌టికే ఫిజిక‌ల్ టాస్కులు, బ్రెయిన్ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ వారి అంద‌రినీ త‌మ త‌మ జీవితాల‌లో ఓసారి వెన‌క్కు తిరిగి చూసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించాడు. ఏం కోల్పోయార‌నేది గుర్తు చేస్తూ, ఏం సాధించార‌నేది వారితోనే చెప్పిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటిస‌భ్యులు ఎమోష‌న‌ల్ అవుతున్నారు. ముఖ్యంగా క‌న్నీళ్ల వర‌ద పారించే మోనాల్‌కు త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోను పంపించారు. అది చూసి చ‌నిపోయిన తండ్రిని గుర్తు చేసుకుంటూ నాన్న ప్రేమ‌కు దూరమ‌య్యాన‌ని వెక్కివెక్కి ఏడ్చింది. నాన్న‌తో క‌లిసి దిగిన ఏకైక ఫొటో ఇదేన‌ని దాన్ని గుండెకు హ‌త్తుకుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ వాళ్లే బిట్టూ అని పిల‌వ‌మ‌న్నారు)

'డ‌బ్బు ఎప్పుడైనా వ‌స్తుంది, కానీ మ‌నుషుల‌ను మిస్స‌యితే చాలా క‌ష్ట‌మ‌'ని మాస్ట‌ర్ కంట‌త‌డి పెట్టుకున్నాడు. ఇక దివి కూడా త‌న చిన్న‌నాటి ఫొటోను ముద్దాడుతూ.. డాడీ అంటే చాలా ఇష్టం, మ‌మ్మీ అంటే ఇంకా ఎక్కువ ఇష్ట‌మ‌ని క‌న్నీళ్ల‌తో వారిపై ప్రేమ కురిపించింది. తాను బిగ్‌బాస్ హౌస్‌కు వ‌చ్చినందుకు మా నాన్న గ‌ర్వంగా ఫీల‌వుతాడ‌ని సోహైల్ సంతోష‌ప‌డ్డాడు. జీవితంలో నిన్ను ఎప్పుడూ బాధ‌పెట్ట‌ను అంటూ లాస్య బిగ్‌బాస్ షో సాక్షిగా తండ్రికి మాటిస్తోంది. ఇక హారిక త‌న తండ్రికి దూరంగా వ‌చ్చేశాన‌ని, వెన‌క్కు తిరిగి చూసిన రోజు ఆగిపోతామ‌ని తెలుసని, అందుకే తాను ఆ ప‌ని చేయ‌ను అంటూ దుఃఖించింది. దీంతో హౌస్‌లో నేడు ఉద్విగ్న వాతావార‌ణం నెల‌కొననున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: కెప్టెన్‌గా నోయ‌ల్, కానీ త‌ప్ప‌ని‌ ముప్పు)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు