బిగ్‌బాస్‌: అఖిల్ మీద ప‌డిపోయిన సోహైల్‌

29 Sep, 2020 15:39 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వారి పంతాల‌ను వీడిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. నామినేష‌న్ చేసిన కంటెస్టెంట్ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ నామినేష‌న్ జోన్‌లోకి పంపిస్తున్నారు. ఆ లిస్టులో కుమార్ సాయి ముందు వ‌రుస‌లో ఉన్నాడు. అలాగే మొన్న‌టి ఫిజిక‌ల్ టాస్క్‌లో గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచిన అభిజిత్‌, కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్‌, లాస్య‌, హారిక‌, సోహైల్ కూడా నామినేట్ అయ్యారు. అయితే చాలామంది ఈ వారం నామినేష‌న్ అస్స‌లు బాగోలేద‌ని పెద‌వి విరుస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ వారం ఎవరు ఇళ్లు వదిలి వెళ్లనున్నారు!)

ఇదిలా వుంటే.. బిగ్‌బాస్ నాల్గో వారంలో ఓ ఆస‌క్తిక‌ర టాస్క్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. పై నుంచి డిస్క్‌లు ప‌డుతుంటే హౌస్‌మేట్స్ ఒక‌రినొక‌రు తోసుకుంటూ మ‌రీ ప‌ట్టుకుంటున్నారు. మాస్ట‌ర్ అయితే ఏకంగా స్విమ్మింగ్ పూల్ సేఫ్ ప్లేస్ అని, అందులోకి దూకేసి మ‌రీ అక్క‌డ ప‌డ్డవాటిని ఏరుకుంటున్నారు. డిస్కులు ప‌ట్టుకోవ‌డం ఏమోకానీ అంద‌రూ ఒక‌రినొక‌రు తోసేసుకుంటూ మ‌రీ ఆడేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాలు జారిన సోహైల్ అఖిల్ మీద ప‌డిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు క‌రువు ప్రాంతంలో ఉన్న జ‌నాల‌కు పులిహోర పొట్లాటు పంచిన‌ట్లుంద‌ని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ ఆట‌లో ఎవ‌రు గెల‌వనున్నారో చూడాలి! (చ‌ద‌వండి: స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజ‌మేనా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు