ఫైర్ బ్రాండ్‌.. క‌రాటే క‌ల్యాణి

6 Sep, 2020 21:01 IST|Sakshi

శ్రీకాకుళంలో పుట్టిన‌ క‌రాటే క‌ల్యాణి విజ‌య‌న‌గ‌రంలో పెరిగింది. కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్‌తో ఆమె ఫేమస్‌ అయ్యారు. ఆ డైలాగ్ జ‌నాల్లోకి బాగా వెళ్లిపోయింది. కానీ తాను ఆ టైపు కాద‌ని సాంప్ర‌దాయ మ‌హిళ‌ అని చెప్తోంది. ఇక సీమంతం చేసుకోవాల‌న్న‌ది త‌న కోరిక అంటోంది‌. అంద‌రూ త‌న‌ను మోసం చేశారని, వాడుకోడాన‌కే చూశార‌ని చేదు సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకుంది. పిల్ల‌ల కోసం ఆరాట‌ప‌డుతున్న‌ ఆ స‌మ‌యంలో 'ఓ బాబును కోళ్ల గూడులో ప‌డేసారు, మీరు పెంచుకుంటారా?' అని ఆమెకు వ‌చ్చిన ఫోన్ కాల్ ఆమె బాధ‌ల‌కు ముగింపు ప‌లికింది. మ‌రో ఆలోచనే చేయ‌కుండా వెంట‌నే బాబును ద‌త్త‌త తీసుకుని అత‌డే స‌ర్వ‌స్వంగా ఆల‌నాపాల‌నా చూసుకుంటోంది. బిగ్‌బాస్‌లో ఉంటే త‌న‌ను తాను అద్దంలో చూసుకోవ‌డ‌మేన‌ని అంటోంది. మ‌రి అద్దంలో త‌న‌కు త‌నే కొత్త‌గా క‌నిపిస్తారా? త‌న చుట్టూ ఉండే వారికి కొత్త‌గా ద‌ర్శ‌న‌మిస్తారా? ప‌నిలో ప‌నిగా కోప‌మొస్తే త‌న క‌రాటే ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా బ‌య‌ట‌పెడ‌తారా చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు