బిగ్‌బాస్ టాప్ 5లో ఉండేది వాళ్లే: కౌశ‌ల్

27 Oct, 2020 20:00 IST|Sakshi

బుల్లితెర బాస్ బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప్ర‌యాణాన్ని చూస్తే విశేషాల క‌న్నా వింత‌లు, వివాదాలే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తాయి. షో ప్రారంభ‌మైన రెండు, మూడు వారాల త‌ర్వాత రావాల్సిన వైల్డ్ కార్డులు మొద‌టి వారాంతం నుంచే హౌస్‌లో అడుగు పెట్ట‌డం అంద‌రినీ కొంత‌ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక వ‌చ్చిన ముగ్గురిలో ఇప్ప‌టికే కుమార్‌, స్వాతి ఇంటి బాట కూడా ప‌ట్టారు. ఈ క్ర‌మంలో సింగ‌ర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌బోతుదంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు దేవి, కుమార్‌, దివి ఎలిమినేష‌న్లు అన్‌ఫెయిర్ అని విమ‌ర్శ‌లు కూడా వస్తున్నాయి. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో చూస్తుండ‌గానే 50 రోజులు పూర్త‌య్యాయి. (చ‌ద‌వండి: అఖిల్ ముందే అవినాష్‌కు మోనాల్ ముద్దు)

ఈ సంద‌ర్భంగా రెండో సీజ‌న్ విజేత కౌశ‌ల్ మండా తాజా సీజ‌న్ గురించి త‌న అభిప్రాయాలు వెల్ల‌డించాడు. ఈ సీజ‌న్ క‌న్నా రెండో సీజ‌నే బాగుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈసారి అన్నీ పాత టాస్కుల‌నే పెడుతున్నార‌ని పెద‌వి విరిచాడు. కాస్త కొత్త టాస్కులు ప్ర‌వేశ‌పెట్టాల‌ని బిగ్‌బాస్ టీమ్‌ను కోరుతున్నాడు. అలాగే గ‌తంలోని కొన్ని ల‌వ్ ట్రాకులను ఈ సీజ‌న్‌కు కూడా అప్లై చేయాల‌ని చూశార‌ని ఇట్టే తెలుస్తోంద‌న్నాడు. అఖిల్‌- మోనాల్‌- అభిజిత్ ట్ర‌యాంగిల్ స్టోరీ విష‌యంలో అదే ప్ర‌యోగం చేశార‌ని,  కానీ బెడిసికొట్టింద‌ని తెలిపాడు. ఇక ఆవేశంతో ఊగిపోయే సోహైల్ త‌న‌ను తాను చాలా మార్చుకున్నాడ‌ని, కొత్త సోహైల్ క‌నిపిస్తున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. త‌న అంచ‌నా ప్ర‌కారం అభిజిత్‌, నోయ‌ల్‌, లాస్య‌, అవినాష్‌తో పాటు అఖిల్ లేదా సోహైల్ టాప్ 5లో ఉండార‌ని జోస్యం చెప్పాడు. ఈ సారి మ‌హిళా విజేత ఉండ‌క‌పోచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. (చ‌ద‌వండి: నామినేష‌న్ అప్పుడు చూపిస్తా: అవినాష్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు