బిగ్‌బాస్‌: కింగ్ ఈజ్ బ్యాక్

31 Oct, 2020 16:49 IST|Sakshi

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం కులుమ‌నాలీ వెళ్లిన విష‌యం తెలిసిందే క‌దా. దీంతో గ‌త‌వారం బిగ్‌బాస్ ఎపిసోడ్ బాధ్య‌ల‌ను కోడ‌లి చేతిలో పెట్టి వెళ్లారు. త‌న సినిమా 21 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని, ఆ త‌ర్వాతే షోలో క‌నిపిస్తాన‌ని అన్నారు. అటు స‌మంత కూడా మామ‌కు చెడ్డ పేరు తీసుకురాకుండా త‌న మాట‌ల‌తో, న‌వ్వుల‌తో షోను చాక‌చ‌క్యంగా నెట్టుకొచ్చింది. అయితే మూడు గంట‌ల ఎపిసోడ్ షూటింగ్‌ సుమారు 10, 12 గంట‌ల పాటు సాగింద‌ట‌. దీంతో బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయ‌డం త‌న‌వ‌ల్ల కాద‌ని స‌మంత‌ చేతులెత్తేసింద‌ట‌. ఈ విష‌యం తెలిసిన నాగ్ త‌ప్ప‌ని ప‌రిస్థితులో మ‌ళ్లీ షోకు విచ్చేస్తున్నారు. (చ‌ద‌వండి: అభిజిత్‌ది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌: దివి)

ప్రైవేటు జెట్‌లో ఆయ‌న హైద‌రాబాద్ చేరుకున్న వీడియోను స్టార్ మా తాజాగా రిలీజ్ చేసింది. "బిగ్‌బాస్ కోసం కింగ్ ఈజ్ బ్యాక్" అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఇంటిస‌భ్యుల గురించి నాగార్జున ఏం మాట్లాడ‌తారో చూడాల‌ని ఉందంటూ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం సామ్ లేక‌పోవ‌డంతో నిరుత్సాహప‌డుతున్నారు. మొద‌ట ప్రోమోను చూడ‌గానే ఇది ట్రావెల్ వ్లాగ్ అనుకున్నామ‌ని త‌ప్పులో కాలేశారు. నాగ్‌ ముందొచ్చినా, లేటొచ్చినా అక్క‌డున్న స్క్రిప్ట్‌నే క‌దా చ‌దివేది అని కొంద‌రు నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు. మ‌రోవైపు దివి కూడా షూటింగ్ స్పాట్‌కు చేరుకుని నాగార్జునతో మాట్లాడింది. ఈ మేర‌కు ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది (చ‌ద‌వండి: సైడ్ అయిన స‌మంత‌‌, హోస్ట్‌గా నాగ్‌?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు