అభిజిత్ సారీ చెప్పాలి, లేదంటే..: కుమార్‌

26 Sep, 2020 18:31 IST|Sakshi

ఈ వారం జ‌రిగిన 'ఉక్కు హృద‌యం' టాస్క్ గురించి కింగ్ నాగార్జున ఏ రేంజ్‌లో క్లాసులు పీకుతాడో అని ప్రేక్ష‌కులు గ‌త కొద్ది రోజుల నుంచి తెగ‌ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నాగ్ ఫైర్ అవ‌డం ప‌క్క‌నపెడితే ఇంటి స‌భ్యులే ఒక‌రి మీద మ‌రొక‌రు అరుచుకునేలా క‌నిపిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోలో నాగ్ గంగ‌వ్వ ఆటాడిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. కిడ్నాప్ ప్లాన్ పారేందుకు కార‌ణ‌మైన అవ్వ‌ను 'దొంగా.. బాగా ఆడుతున్నారు' అని ప్ర‌శంసించారు. మాస్ట‌ర్‌కే తెలీకుండా అత‌ని ద‌గ్గ‌ర అవినాష్ చార్జింగ్ కొట్టేయ‌డాన్ని కూడా నాగ్ ప్ర‌స్తావించారు. మీరు అమ్మ రాజ‌శేఖ‌ర్ కాదు, అమాయ‌క రాజ‌శేఖ‌ర్ అని సంభోదించారు. (చ‌ద‌వండి: అభిజిత్‌లో ధోనీని చూశా: యాంక‌ర్ ర‌వి)

అఖిల్‌కు అభి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే
'అభిజిత్ నీకే ఎందుకు చార్జింగ్ ఇచ్చాడు' అని హారిక‌ను ప్ర‌శ్నించ‌డంతో ఆమె ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌క దిక్కులు చూసింది. ఇక‌ టాస్క్‌లో క‌నీసం త‌న‌కు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వ‌ని అభిజిత్‌పై కుమార్ సాయి ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే భిన్న ధృవాలైన అభి, అఖిల్‌కు మ‌ధ్య అగ్గి రాజేసిన‌ట్లు క‌నిపిస్తోంది. 'నాకు ముప్పై ఏళ్లు, పెద్ద చ‌దువులు చ‌దివాను.. న‌న్ను అఖిల్‌ ఒరేయ్ అంటాడా?' అని అభిజిత్ అన‌డం న‌చ్చ‌లేద‌ని, అత‌డు సారీ చెప్పాల‌ని కుమార్ పట్టుప‌ట్టాడు. లేదంటే తాను ఎలిమినేట్ అయ్యేంత‌వ‌ర‌కు అభినే నామినేట్ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. నిజానికి త‌న‌కంటే చిన్న‌వాడైన అఖిల్ త‌న‌ను 'రా, అరేయ్' అని పిల‌వ‌డం న‌చ్చ‌లేద‌ని అభి గ‌తంలోనూ ఇంటిస‌భ్యుల‌తో చెప్పుకొచ్చాడు.

అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకున్న కుమార్‌!
కానీ విద్యార్హ‌త గురించి మాట్లాడాడా?  లేడా అన్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు. మ‌రి కుమార్ ఆరోప‌ణ‌ల‌ను అంగీక‌రిస్తూ అభిజిత్ క్ష‌మాప‌ణ‌కు సిద్ధ‌మ‌వుతాడా? లేదా త‌ను అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని ఖండిస్తాడా? అనేది మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది. అయితే వారిద్ద‌రి మ‌ధ్య‌లోకి మూడో వ్య‌క్తి కుమార్ సాయి ఎందుకు వెళ్లాడ‌ని కొంద‌రు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంలో కుమార్ పెద్ద త‌ప్పు చేశాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. (చ‌ద‌వండి: నాతో జీవితంలో మాట్లాడ‌కు: అమ్మ రాజ‌శేఖ‌ర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు