బిగ్‌బాస్‌: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ

14 Sep, 2020 16:52 IST|Sakshi

వీకెండ్‌లో(శని, ఆది) సరదాగా ఆట, పాటలతో ఎంజాయ్‌ చేసిన బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు సోమవారం రాగానే మళ్లీ గేమ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. మొదటి వారం పూర్తిచేసుకున్న బిగ్‌ బాస్‌హౌజ్‌ హౌజ్‌ సోమవారంతో రెండో వారంలోకి ప్రవేశిస్తోంది. ఆరంభం నుంచే బిగ్‌బాస్‌ సీజన్‌ 4 చప్పగా సాగుతోందని టాక్‌ వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రోమోల రూపంలో మాత్రం నెటిజన్లలో హైప్‌ క్రియెట్‌ చేస్తున్నాడు బిగ్‌బాస్‌. తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే బిగ్‌బాస్‌‌ హౌజ్‌లో రెండో వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలయ్యింది. ఇప్పటికే కంటెస్టెంట్లలో ఒకరికొకరికి మధ్య సరైన అవగాహన లేదన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పిస్తుండగా.. దీన్ని ఆసరాగా చేసుకున్న బిగ్‌బాస్‌ మరోసారి వారి మధ్య చిచ్చు పెట్టేందుకు సిద్ధపపడ్డాడు. (హారిక విష ‌స‌ర్పం, అఖిల్ దున్న‌పోతు..)

సోమవారం బిగ్‌బాస్‌ తమ కంటెస్టెంట్‌లకు ఓ టాస్క్‌ను ఇచ్చాడు. ఇంటిలోపల ఓ పడవను ఏర్పాటు చేసి అందులోకి అందరిని ఎక్కమని చెప్పాడు. సభ్యులందరూ పడవ ఎక్కిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దిగేందుకు వీల్లేదని తెలిపాడు. పడవ తీరం చేరుకున్నాక హారన్‌ కొట్టిన వెంటనే ఓ ప్యాసింజర్‌ ఖచ్చితంగా దిగాలని నిబంధన పెట్టాడు. అలా ఎవరైతే పడవ నుంచి దిగుతారో వారు ఈ వారం నామినేషన్‌ అవుతారని పేర్కొన్నాడు. దీంతో ఇంట్లోని వారిలో ఎవరిని పడవ నుంచి దింపేయలాన్న సందేహం మొదలైంది. అయితే ముందు నేనే దిగి వెళ్లి పోతానంటూ గంగవ్వ సిద్ధపడంది. దీంతో గంగవ్వను ఆపేందుకు మిగిలిన వారందరరూ ప్రయత్నినట్లు కన్పిస్తోంది. మధ్యలో నోయల్‌ కల్పించుకొని.. అందరితో మంచి రిలేషన్‌ ఉన్నందున ఆ బంధం తెగిపోవద్దని అలా దిగిపోతానంటుదని అంటున్నాడు. అయితే ఎవరిని ఉద్ధేశించి ఆ మాటలు అన్నాడో పక్కగా తెలియదు. (బిగ్‌బాస్‌: నేడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ)

మరోవైపు మొదటి నామినేషన్‌లో భాగంగా డైరెక్టర్‌ సూర్యకుమార్‌ ఇంటి నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. అలా సూర్య వెళ్లాడో లేదో ఇలా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా సాయి అనే కుర్రాడు అడుగు పెట్టాడు. దొంగలా హౌజ్‌లోకి అర్థరాత్రి ప్రవేశించిన కుమార్‌ సాయి ఇంటి సభ్యులందరికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనున్నాడు. అయితే ఈ ప్లాన్‌ బెడిసి కొట్టి దొంగ అనుకొని ఇంటి సభ్యులు తనను కొట్టే అవకాశం ఉందని భయతో కుమార్‌ సాయి బిగ్‌బాస్‌తో విన్నపించుకున్నాడు. మరి సాయి కుమార్‌ ఇంట్లో వాళ్లతో ఎలా కలవనున్నాడు. బోట్‌ టాస్క్‌లో ఎంత మంది చివరి వరకు ఉంటారు, ఎవరు దిగిపోయి నామినేషన్‌లో నిలిచారో తెలుసుకోవాలంటే ఈ రోజు జరిగే బిగ్‌బాస్‌ చూడాల్సిందే. (మైండ్ బ్లాక్ చేసిన దివి, దేవి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు