బిగ్‌బాస్‌ : అఖిల్‌పై పగ తీర్చుకున్న కుమార్‌ సాయి

18 Dec, 2020 20:07 IST|Sakshi

బిగ్ బాస్ నాల్గో సీజన్‌లోకి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్‌ కోసమే కుమార్‌ సాయిని బలి చేశారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఎలిమినేట్‌ అయినప్పటికీ కుమార్‌ సాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాల్గో సీజన్‌ మొత్తంలో ‘మంచోడు’ అని పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కుమార్‌ అనే చెప్పాలి. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఆతను గేమ్‌ ఆడాడు. ఇంటి సభ్యులంతా అతన్ని వేరుగా చూసినా.. ఆయన మాత్రం ఎవరిపైనా కోపం కానీ ద్వేషం కానీ ప్రదర్శించలేదు. ఎలిమినేట్‌ అయిన రోజు కూడా ఈ ‘మంచోడు’ని హౌస్‌మేట్స్‌ సరిగా సాగపంపలేదు.

ముఖ్యంగా ‘కరివేపాకు’ గొడవను ఇప్పటికీ మర్చిపోలేదు. లిమినేషన్ ఎపిసోడ్‌లో.. నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కర్నీ ఒక్కో విజిటబుల్‌‌తో చక్కని పోలిక ఇచ్చాడు. అందులో భాగంగా అఖిల్‌ని కరివేపాకుతో పోల్చుతూ.. పాజిటివ్‌గా మాట్లాడాడు. కానీ దీన్ని నెగిటివ్‌గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా? అని అప్పట్లో అఖిల్‌ని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు. 

ఇదిలా ఉంటే...అఖిల్‌పై ఉన్న పగను కుమార్‌ సాయి తీర్చుకున్నాడు.  రీ యూనియన్‌లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్‌కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి నవ్వుతూనే అఖిల్, హారికపై ఉన్న పగను తీర్చుకున్నాడు. సిల్లీ రీజన్స్‌తో తనను నామినేట్‌ చేసిన హారికను..‘నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా?  టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పావ్‌’అని తన మనసులో ఉన్న పగను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సొహైల్‌తో జరిగిన గొడవలో వేలు సింటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్‌ని‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర’ అంటూ  పులిహోరా రాజాకి గట్టిగానే ఇచ్చేశాడు. అయితే ఇవన్ని ఇంటి సభ్యులు సరదాగానే తీసుకున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంకా కుమార్‌ సాయి ఎవరెవరిపై పంచ్‌లో వేశాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు