బిగ్‌బాస్‌ నోట సోహైల్‌ యాస

13 Nov, 2020 20:38 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నవ్వడం నిషేధం’ టాస్క్‌ నవ్వులు పూయించేలా ఉంది. తోటి సభ్యులను నవ్వించడానికి కంటెస్టెంట్లు నానా యేషాలు వేశారు. ఎంతకీ హౌస్‌మేట్స్‌ నవ్వకపోవడంతో చివరికి బిగ్‌బాసే రంగంలోకి దిగి ఇంటి సభ్యులను నవ్వించాడు. దీంతో పాటు ఈ రోజు లాస్యకు ఊహించని గిఫ్ట్‌ అందినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుంది. దిపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి ఇంటి సభ్యుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. ఇక ఏది కూడా ఊరికే ఇవ్వని బిగ్‌బాస్‌.. ఈ గిఫ్ట్‌ పొందాలంటే ఓ టాస్క్‌ గెలువాలని కండిషన్‌ పెట్టాడు.

ఆ టాస్కే ‘నవ్వడం నిషేధం’.. ఇంట్లో ఏ ఒక్కరు నవ్వినా టాస్క్‌ ఓడిపోయినట్లే. అయితే ఎవరైతే నవ్విస్తారో వాళ్లు ఈ టాస్క్‌ గెలిచినట్లు. దీంతో గిఫ్ట్‌లు పొందాలనే ఆశతో ఇంటి సభ్యులు నవ్వించే పనిలో పడ్డారు. ఇక ఎంటరైన్మెంట్ ఈస్‌ బ్యాక్‌ అంటూ.. అవినాష్‌ తనలోని కమెడియన్‌ను బయటకు తీశాడు. ఇక ప్రతి చిన్న విషయానికి నవ్వులు చిందించే లాస్కను టార్గెట్‌ చేశాడు అవినాష్‌. తదైన శైలీలో కామెడీ చేసి లాస్యను నవ్వించాడు. అలా మెహబూబ్‌, సోహైల్‌ను కూడా నవ్వించేశాడు. ఇక సోహైల్‌ అయితే జోకర్‌ వేసి మరి నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఎవ్వరూ నవ్వకపోవడంతో తన చిరకాల మిత్రుడు మెహబూబ్‌తో దగ్గరికి వెళ్లి బ్రతిమిలాడి మరీ నవ్వించాడు. ‘మొత్తం వేషం వేశార్రా.. దీనికైనా నవ్వురా’ అని సోహైల్‌ అనగా.. అస్సలు బాలేదురా అంటూ మెహబూబ్‌ సింపుల్‌గా పక్కకి తోసాడు. ఇక అభిజిత్‌ కూడా అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉంటే.. ఇంటి సభ్యులను నవ్వించేదుకు బిగ్‌బాసే రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ‘సోహైల్‌ ఏందీ పంచాయితీ.. కథెట్లుంది’ అంటూ సోహైల్‌ యాసలో మాట్లాడాడు. దీంతో ఆశ్చర్యపోయిన సోహైల్‌.. కథ వేరేలా ఉంది బిగ్‌బాస్‌ అంటూ తనదైన శైలీలో చెప్పాడు. ఇక దీపావళి సందర్భంగా లాస్యకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చినట్లు ఉన్నాడు బిగ్‌బాస్‌. లాస్య కుమారుడి వాయిస్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌లో వినిపించాడు. దీంతో లాస్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సంతోషంతో చిందులేసింది.  ఇంకా బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ రోజు ఏమేం జరిగాయో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

>
మరిన్ని వార్తలు