టాప్ 2: లాస్య జోస్యం నిజ‌మ‌య్యేనా?

22 Nov, 2020 23:15 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు దాటిపోవ‌డంతో జున్ను ఆమెను పూర్తిగా మార్చిపోయాడు. దీంతో ఆమె జున్ను చెంత‌కు చేరి త‌ల్లి ప్రేమ‌ కురిపించి మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కు తీసుకోనుంది. ఇక వెళ్తూ వెళ్తూ కిచెన్ బాధ్య‌త‌ల‌నే బిగ్‌బాంబ్‌ను ఆమెకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి మీద వేసింది. వాళ్లెవ‌రు? నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ క‌న్నేయండి..

సేఫ్‌గా ఆడ‌టం మీ స్ట్రాట‌జీనా?
సండేను ఫండేగా మార్చేందుకు సిద్ధ‌మైన నాగార్జున‌ ఇంటి స‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. అవినాష్‌, అరియానా, సోహైల్‌, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలిన‌వారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. వీరికి కొన్ని ఫొటోల‌ను చూపించి దాని ఆధారంగా పాట‌ల పేర్ల‌ను చెప్ప‌మని గేమ్ ఆడించారు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్ ముగిసేస‌రికి బీ టీమ్ గెలిచింది. బీ టీమ్‌ కెప్టెన్‌ హారిక సేఫ్‌ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు. అనంత‌రం ఓ ప్రేక్ష‌కురాలు సంధించిన ప్ర‌శ్న‌ను వినిపించారు. సేఫ్‌గా ఆడ‌టం మీ గేమ్ స్ట్రాట‌జీనా అని ఓ అభిమాని లాస్య‌ను అడ‌గ్గా తాను సేఫ్ గేమ్ ఆడ‌టం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. త‌ర్వాత మోనాల్ సేఫ్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: సెల్ఫ్‌డ‌బ్బా కొట్టుకున్న హారిక‌)

అవినాష్‌కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్‌
ఇంటిస‌భ్యుల‌తో వెరైటీగా లూడో గేమ్ ఆడించారు. ఇందులో సోహైల్‌, అవినాష్ ఉన్న‌ అరియానా టీమ్‌లో మోనాల్‌,  మిగిలిన స‌భ్యులు ఉన్న‌ హారిక టీమ్‌లో అభిజిత్ డైస్ రోల్ చేశారు. సోహైల్‌, అఖిల్ డైస్ రోల్ చేసిన నంబ‌ర్ల ఆధారంగా ఒక్కో గ‌డిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇందులో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్‌ను అవినాష్ వేళ్ల‌కు అందంగా రుద్దాడు. అటు అఖిల్ రొమాంటిక్ సాంగ్‌ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, స్లో మోష‌న్‌లో ఖూనీ చేయ‌కుండా పాడి మెప్పించాడు. త‌ర్వాత లాస్య నాలుక బ‌య‌ట‌పెట్టి డైలాగులు చెప్ప‌డం అంద‌రికీ న‌వ్వు తెప్పించింది.

అరియానా సేఫ్‌, లాస్య అవుట్‌
ఇక అవినాష్ ఒక్క నిమిషంలో చీర క‌ట్టుకుని చిందులు వేయగా..‌ రాత్రి తొమ్మిది త‌ర్వాత నువ్వు చేసేది ఇదే అన్న‌మాట అని నాగ్ కౌంట‌ర్ వేశారు. ఈ దెబ్బ‌తో త‌న పెళ్లి సంబంధాలు గోవిందా అని డీలా ప‌డ్డ‌ అవినాష్ త‌ర్వాత టాస్కులో భాగంగా నిమ్మ‌కాయ‌ను న‌మిలిపారేశాడు. మొత్తానికి లూడో గేమ్‌లో అరియానా టీమ్ గెల‌వ‌గా హారిక టీమ్ ఓడిపోయింది. త‌ర్వాత అభిజిత్‌, అరియానా సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌గా లాస్య ఎలిమినేట్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. (చ‌ద‌వండి: సోష‌ల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌..)

అంద‌రి క‌న్నా వీక్ అనుకున్నా.. 
స్టేజీ మీద‌కు వ‌చ్చిన లాస్య ముందుగా త‌న‌ న‌వ్వు నిజ‌మైన‌దేన‌ని, క‌న్నింగ్ కాద‌ని చెప్పుకొచ్చింది. ఆ విష‌యం ప్రేక్ష‌కుల‌కు కూడా తెలుస‌ని నాగ్ భ‌రోసా క‌ల్పించారు. త‌ర్వాత లాస్య.. సోహైల్‌, అభిజిత్ టాప్ 2లో ఉంటార‌ని జోస్యం చెప్పింది. దీంతో భావోద్వేగానికి సోహైల్‌.. అంద‌రిక‌న్నా వీక్ అనుకున్నా కానీ అక్క‌ టాప్ 2లొ ఉంటాను చెప్ప‌గానే ఈ మాట చాలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. అవినాష్‌.. ఎంట‌ర్‌టైన‌ర్ కానీ నామినేష‌న్‌ను తీసుకోలేడ‌‌ని చెప్పింది. మోనాల్ బాగా ఆడుతుంది కానీ క‌న్ఫ్యూజ‌న్‌లో ఉంటుంద‌ని పేర్కొంది. అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుంది, కానీ కొన్నిసార్లు త‌ప్పును కూడా ఒప్పుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చింది. (చ‌ద‌వండి: మొద‌టిసారి నాకు ముద్దు పెట్టావు: అఖిల్‌)

అభిజిత్ అంటే ఇష్టం అంటూనే అత‌డిపై బిగ్‌బాంబ్‌
సోహైల్‌కు ఎంత కోపం వ‌స్తుందో అంత త్వ‌ర‌గా క‌రిగిపోతుంది అని చెప్పుకొచ్చింది. అఖిల్ బాగా ఆడ‌తాడు. కానీ కోపం ఎక్కువ‌. ఎదుటివాళ్ల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వడ‌ని, అది మార్చుకోమ‌ని సూచించింది. అభి నాకు చాలా ఇష్టం. అంద‌రినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. హారిక‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డం మ‌రీమ‌రీ ఇష్టం. అల్ల‌రి పిల్ల. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని అనిపిస్తే వాదించి సాధిస్తుంది. త‌ను టాప్ 3 నుంచి 1కి వెళ్లాల‌ని తెలిపింది. అనంత‌రం కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్‌కు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాల‌న్న బిగ్‌బాంబ్ అభి మీద ప‌డింది. కానీ అభి మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఒక్క‌టే చేస్తాన‌ని చెప్పేశాడు. (చ‌ద‌వండి: అభి, నీ బ్ర‌ద‌ర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు