పెళ్లి విష‌యం ఏడేళ్లు దాచా: లాస్య

15 Oct, 2020 23:42 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రినీ ఓసారి వారి కుటుంబాల‌ను గుర్తుచేసుకునేందుకు బిగ్‌బాస్ ఓ అవ‌కాశ‌మిచ్చాడు. ఈ సంద‌ర్భంగా అంద‌రూ త‌మ జీవితాల్లో చోటు చేసుకున్న కీలక ప‌రిణామాల గురించి చెప్పుకొచ్చారు. అయితే లాస్య మాత్రం తాను పుట్టినప్పుడు త‌ల్లి ప‌డ్డ బాధ చెప్తూ త‌ల్ల‌డిల్లిపోయింది. వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న‌ప్పుడు నాన్న అస‌హ్యించుకున్నాడ‌ని చెప్తూ కుంగిపోయింది. కానీ ఆ ఇద్ద‌రే ఇప్పుడు త‌న‌ కొడుకు జున్నును చూసుకుంటున్నారంటూ ఆనంద భాష్పాల‌తో వారికి కృత‌జ్క్ష‌త‌లు చెప్పింది. 

"నేను రైతు బిడ్డ‌ను. 9 నెల‌లు మోస్తున్న‌ప్పుడు కూడా అమ్మ గ‌డ్డి కోయ‌డానికి వెళ్లింది. అప్పుడే క‌డుపులో ఉన్న నేను అడ్డం తిరిగాన‌ట‌. ఓ వైపు రక్తం కారుతున్నా అమ్మ‌ కిలో మీట‌రు న‌డిచి ఇంటికి చేరుకుని మంచంపై ప‌డుకుంది. నేను అక్క‌డే పుట్టాను. స‌హ‌నం అమ్మ ద‌గ్గ‌ర‌, భ‌రించ‌డం నాన్న ద‌గ్గ‌ర నుంచి నేర్చుకున్నాను. నాన్న‌కు న‌చ్చ‌ని ప‌ని(పెళ్లి) చేసినందుకు మూడేళ్లు నాతో మాట్లాడ‌లేదు. అయితే ఆయ‌న‌కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు మొద‌టిసారి అప్పు చేశాను. అంద‌రి ద‌గ్గ‌రా అడిగి ల‌క్షా 50 వేలు అప్పు చేశాను. మూడు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు జ‌రిగాయి. అప్పుడు నాకు ద‌గ్గ‌రివాళ్లు కూడా సాయం చేయ‌లేదు. నా భ‌ర్త ముందుకు వ‌చ్చి నిల‌బ‌డ్డాడు. ఇక‌ అప్ప‌టి నుంచి నాన్న మా ఆయ‌న్ను కొడుకు అని పిలుస్తాడు. మా నాన్న‌ను జీవితంలో ఇంకెప్పుడూ బాధ‌పెట్ట‌ను" అని లాస్య బిగ్‌బాస్ సాక్షిగా మాటిచ్చింది. (బిగ్‌బాస్‌: క‌ళ్ల‌కు గాయాలు, ఎలిమినేట్‌!)

త‌న‌ది రిజిస్ట‌ర్ మ్యారేజ్ అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకున్న ఏడేళ్ల వ‌ర‌కు ఆ విష‌యం ఎవ‌రికీ చెప్ప‌లేద‌ని బాధ‌ప‌డింది. షోల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా త‌ను నా క‌జిన్ అని చెప్పానే కానీ భ‌ర్త అని చెప్ప‌లేక‌పోయాన‌ని చింతించింది. నాన్నకిచ్చిన మాట కోసమే నా పెళ్లి విష‌యం బ‌య‌ట‌ప‌డ‌నివ్వ‌లేద‌ని వాపోయింది. అంద‌రినీ విడిచి ఉంటాన‌ని చెప్పాను కానీ చాలా మిస్స‌వుతున్నాను అంటూ కెమెరాల ముందు క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది. ప్ర‌తిరోజు రాత్రి గుర్తు చేసుకుంటున్నా అని లాస్య వెక్కి వెక్కి ఏడ్చింది. (గంగ‌వ్వ‌కు కొత్త‌ ఇల్లు క‌ట్టిస్తా: నాగ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు