బిగ్‌బాస్‌: మోనాల్ కోసం మెహ‌బూబ్ బ‌ల‌వుతాడా?

3 Nov, 2020 16:57 IST|Sakshi

మెహ‌బూబ్ దిల్‌సే.. మొద‌ట్లో అత‌డిని వీలైనంత తొంద‌ర‌గా బిగ్‌బాస్ హౌస్ నుంచి పంపిచేయాల‌ని చాలామందే కాచుకుని కూర్చున్నారు. కానీ అత‌డు నామినేష‌న్ జోన్‌లోకే రాకుండా త‌ప్పించుకు తిరగ‌డం, ఈ మ‌ధ్య‌లో బిగ్‌బాస్ ఇచ్చిన ప్ర‌తి టాస్క్‌లో త‌న సత్తా చూపిస్తూ త‌నేంటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో అత‌డిపై ఉన్న నెగెటివిటీ త‌గ్గుతూ వ‌స్తోంది. పైగా టాస్కుల్లో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పోటీప‌డే వాళ్లు చాలా అరుదు. ముఖ్యంగా ఫిజిక‌ల్ టాస్కుల్లో మెహ‌బూబ్‌ను ఢీ కొట్ట‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఇంటిస‌భ్యులే అంగీక‌రించారు. అలాంటిది మెహ‌బూబ్ వెళ్లిపోతే టాస్కుల్లో బ‌ల‌మైన పోటీ ఉండ‌దేమో అన్న ప‌రిస్థితి దాపురించింది. అయితే మెహ‌బూబ్‌ కొన్నిసార్లు నోరు జారుతాడ‌న్న మాటే కానీ, ఎదుటి వాళ్లు నొచ్చుకున్న‌ట్లు అనిపిస్తే క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్తాడ‌ని అఖిల్‌, అభిజిత్ విష‌యంలో నిరూపించాడు. అలా ఇంటిస‌భ్యుల‌తో విబేధాలు త‌గ్గించుకుని స‌ఖ్య‌త‌గా ఉంటున్నాడు. (బిగ్‌బాస్‌ : మోనాల్‌కి అభి భరోసా.. మాటపై నిలబడేనా!)

మొన్న‌టి ఆదివారం ఎపిసోడ్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్, మెహ‌బూబ్‌ల‌లో ఎవ‌రు ఇంట్లో ఉండిపోవాల‌నుకుంటున్నారు అని నాగార్జున ఓ ప్ర‌శ్న‌ను లేవనెత్తారు. అరియానా, అవినాష్ త‌ప్ప మిగ‌తా అంద‌రూ మాస్ట‌ర్ వెళ్లిపోవాల‌ని, మెహ‌బూబ్‌కు ఇంట్లో కొన‌సాగే అర్హ‌త ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో మెహ‌బూబ్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అవ‌త‌రిస్తున్నాడన్న విష‌యం ఇక్క‌డే తేలిపోయింది. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే హౌస్‌లో గొడ‌వ‌లు ఉండాల‌నో మ‌రేంటో తెలీదు కానీ బిగ్‌బాస్ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను కాపాడాల‌ని విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. కానీ అత‌డిని సేఫ్ చేసే కొద్దీ ప్రేక్ష‌కుల్లో మాస్ట‌ర్‌పై వ్య‌తిరేక‌త పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌వేళ ఈ వారం మాస్ట‌ర్ ఎలిమినేట్ అయితే అంద‌రి టార్గెట్‌ మోనాల్‌, మెహ‌బూబ్ మీదే ఉంటుంది. హీరోయిన్ మోనాల్‌కు ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌నే ఉంది. దాంతోపాటు బిగ్‌బాస్ ఆమెను వ‌దులుకోడానికి బొత్తిగా ఇష్ట‌ప‌డ‌టం లేదు. పైగా ఆమె కోసం మెహ‌బూబ్‌పై వేటు వేయ‌డానికి కూడా వెన‌క‌డుగు వేయ‌డు. అయితే రోజురోజుకీ అత‌డి పాపులారిటీ పెరుగుతుండ‌టం బిగ్‌బాస్ టీమ్‌కు త‌ల‌నొప్పిగా మారుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ ప్ర‌మాదం నుంచి మెహ‌బూబ్ బ‌య‌ట‌ప‌డాలంటే అత‌డు నామినేష‌న్‌లోకి రాకుండా త‌ప్పించుకోవ‌డ‌మో లేదా ఫిజిక‌ల్ టాస్కుల‌తో పాటు మిగ‌తావాటిలో కూడా అంద‌రికీ గ‌ట్టి పోటే ఇస్తూ ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డ‌మో చేయాలి. ఇదే క‌న‌క జ‌రిగితే మెహ‌బూబ్‌ టాప్ 5లోకి వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. (అఖిల్ ప్యాంటులో ఐస్‌గ‌డ్డ‌లు వేసి అరాచ‌కం)

మరిన్ని వార్తలు