బిగ్‌బాస్‌: అదృష్టాన్ని కాలితో త‌న్నేశాడు

30 Sep, 2020 16:32 IST|Sakshi

ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ట్రాక్ ఎక్కుతోంది అని సంబ‌ర‌ప‌డే స‌మ‌యానికి మ‌ళ్లీ గాడి త‌ప్పింది. ప‌స లేని టాస్కులు, పైగా వాటిని సీరియ‌ల్ ఎపిసోడ్‌లా సాగ‌దీయ‌డం, అటు కంటెస్టెంట్లు సైతం గ‌డిచిన‌ ఫిజిక‌ల్ టాస్కునే ప‌ట్టుకుని ఇప్ప‌టికీ వేలాడుతుండ‌టం ప్రేక్ష‌కులకు చిరాకు పుట్టిస్తున్నాయి. కాక‌పోతే మొన్న‌టివ‌ర‌కు పెద్ద‌గా ప‌ట్టించుకోని కంటెస్టెంట్ల‌కు స్క్రీన్‌పై క‌నిపించే స‌మ‌యాన్ని పొడిగించ‌డం మంచి ప‌రిణామం. ఇక‌ అమ్మాయిల‌తో క‌లిసి ఉంటున్న‌వాళ్ల‌కే ప్రాధాన్య‌త ఉంటోంద‌ని లేటుగా తెలుసుకున్న మెహ‌బూబ్‌, సోహైల్ తాజా డిస్కు ఆట‌లో బాగానే ఆడుతున్నారు. దొంగ‌త‌నం చేయ‌బోయి చివ‌రి నిమిషంలో అడ్డంగా దొరికిపోతున్న సోహైల్ నేటి ఎపిసోడ్‌లోనైనా స‌ఫ‌లీకృతుడ‌వుతాడేమో చూడాలి. (చ‌ద‌వండి: నువ్వేం త‌క్కువ కాదు: దివిపై సోహైల్ ఫైర్‌)

మ‌రోవైపు మెహ‌బూబ్ మంచి అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. చేతుల‌తో అందుకోవాల్సిన అదృష్టాన్ని కాలితో త‌న్నేశాడు. ప‌వ‌ర్ కాయిన్‌ను చేజేతులా కింద పారేశాడు. ఏదైతే అది అయిందిలేన‌ని సుజాత అత‌డు పాడేసిన ప‌వర్ కాయిన్‌ను ల‌టుక్కున ప‌ట్టేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌ అది స్పెష‌ల్ కాయిన్ అని చెప్ప‌డంతో ఎంత ప‌ని చేశాన‌ని మెహ‌బూబ్‌ నాలుక క‌రుచుకున్నాడు. అత‌డు చేసిన ఘ‌న‌కార్యానికి ఇజ్జ‌త్ పోతుంద‌ని సోహైల్ తిట్టిపోశాడు. అయినా ఇప్పుడు మాత్రం ఎన్న‌నుకుంటే ఏం లాభం, ఆ తెలివి ముందుండాల‌ని నెటిజ‌న్లు కండ‌ల వీరుడికి బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి స‌మ‌యాల్లోనే మెద‌డుకు ప‌ని చెప్పాల‌ని చుర‌క‌లంటిస్తున్నారు. మ‌రి ఈ టాస్క్‌లో చివ‌రాఖ‌రికి ఎవ‌రు గెలుస్తార‌నేది చూడాల్సిందే.. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: గంగ‌వ్వ‌కు అత‌డిష్టం, ఆమె క‌ష్టం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు