అఖిల్‌ను కాద‌ని అభిజిత్ కోసం మోనాల్ త్యాగం!

23 Nov, 2020 18:04 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌న్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. రోజులు త‌గ్గేకొద్దీ వారి మ‌ధ్య పోటీ మ‌రింత పెరుగుతోంది. మొద‌ట్లో పెద్ద‌గా క‌ష్ట‌ప‌డిన‌ట్లు క‌నిపించ‌ని మోనాల్.. ఏడుసార్లు కెప్టెన్సీ కోసం పోరాడి ఓడిన హారిక‌ను ఇంటి కెప్టెన్‌గా గెలిపించిచి అంద‌రి మ‌నసుల‌ను దోచుకుంది. దీంతో త‌ను కూడా స్ట్రాంగేన‌ని ఇంటిస‌భ్యుల‌కు చెప్ప‌క‌నే చెప్పింది. ఇక ప్ర‌తివారం నామినేట్ అయ్యే మోనాల్ ఈ ఈసారి కూడా నామినేష‌న్ లిస్టులో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉంది.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఓట్ల ఆధారంగా కాకుండా ప్ర‌త్యేక టాస్క్ ద్వారా నామినేష‌న్ నిర్వ‌హించారు. అందులో భాగంగా బ‌జ‌ర్ మోగ‌గానే కెప్టెన్ హారిక మిన‌హా మిగ‌తా ఇంటి స‌భ్యులు బ‌య‌ట ఉన్న టోపీల‌ను ధ‌రించారు. అందులో ఎరుపు రంగు టోపీ ధ‌రించిన అవినాష్‌, అభిజిత్‌, అఖిల్‌, అరియానా నేరుగా నామినేట్ అయిన‌ట్లు బిగ్‌బాస్ తెలిపాడు.

అవినాష్‌కు కౌంట‌రిచ్చిన మోనాల్‌
కానీ వారు సేవ్ అయ్యేందుకు ఓ అవ‌కాశం క‌ల్పించాడు. బ‌య‌ట ఉన్న స‌భ్యుల్లో ఒక‌రితో స్వాప్(ఒక‌రి స్థానంలోకి మరొక‌రు రావ‌డం) చేసుకోవ‌చ్చ‌ని సూచించాడు. దీంతో ఎక్కువ మంది మోనాల్‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 'బ‌ల్ల‌గుద్ది చెప్తున్నా.. నీకన్నా 100 కాదు 200% ఈ షోకు నేను అర్హుడిని' అని అవినాష్ చెప్ప‌గా.. అలాంట‌ప్పుడు భ‌య‌మెందుకు, నామినేష‌న్‌లో ఉండు అని మోనాల్ కౌంట‌రిచ్చింది. మంచి గేమ్ ఆడుతున్నాను అనుకున్న‌ప్పుడు ఎందుకు భ‌య‌ప‌డుతున్నావు? అంటూ అవినాష్ నోరు మూయించింది. అరియానా కూడా స్వాప్ కోసం మోనాల్‌ను అభ్య‌ర్థించ‌గా కుద‌ర‌ద‌ని ఆమె క‌రాఖండిగా తేల్చి చెప్పింది. (చ‌ద‌వండి: అభిజిత్ ల‌వ్ స్టోరీ చెప్పండి: నాగ్‌)

అఖిల్‌- మోనాల్ మ‌ధ్య పెరుగుతున్న దూరం
ఇక అఖిల్‌.. 'నాకు చాలా స‌పోర్ట్ చేస్తున్నావు అని అంతా అనుకుంటున్నారు. ఎప్పుడు చేశావు?' అని ప్ర‌శ్నించాడు. దీంతో మోనాల్‌.. 'అది చేశాను, ఇది చేశాను అని నేను చెప్ప‌ను. నువ్వు నా కోసం చాలా మంచి చేశావు' అంటూ దండం పెట్టేసి స్వాప్ చేసుకునే ఆలోచ‌నే లేద‌న్న‌ట్టుగా నిల‌బ‌డిపోయింది. చివ‌ర్లో మాత్రం మోనాల్ అంద‌రికీ దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఆమె అభిజిత్‌తో స్వాప్ చేసుకుంటూ అత‌న్ని సేవ్ చేస్తూ నామినేష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు చూపించారు. ఇక్క‌డ అఖిల్ ఎక్స్‌ప్రెష‌న్స్ మ‌రింత హైలెట్‌గా మారాయి. త‌న‌ను కాద‌ని మోనాల్..  అభి కోసం త్యాగానికి సిద్ధ‌మ‌వ‌డం అత‌డు జీర్ణించుకోలేన‌ట్లు క‌నిపిస్తున్నాడు. అయితే మోనాల్ అభి కోసం నామినేష‌న్‌లోకి వెళ్లిందా? లేదా హారిక కెప్టెన్సీ ప‌వ‌ర్‌తో అభిని సేవ్ చేసి మోనాల్‌ను నామినేష‌న్‌లోకి పంపించిందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌గా మారింది. (చ‌ద‌వండి: మోనాల్ మాత్రం కోడ‌లిగా రాదు: అఖిల్ త‌ల్లి)

మరిన్ని వార్తలు