బిగ్‌బాస్‌: అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్

27 Oct, 2020 16:44 IST|Sakshi

నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తితో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి త‌ప్ప వేరొక‌రిని మ‌ధ్య‌లోకి లాగ‌కూడ‌ద‌ని నాగార్జున ఇదివ‌ర‌కే వార్నింగ్ ఇచ్చారు. అయినా స‌రే నిన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ అఖిల్‌ను నామినేట్ చేస్తూ అభిజిత్‌, మోనాల్ విష‌యాన్ని ప్ర‌స్తావించాడు. దీంతో మోనాల్ ఖంగు తింది. మ‌రోవైపు నువ్వు పెద్ద త‌ప్పు చేశావు అంటూ అభి వేలెత్తి చూప‌డం ఆమె త‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌తివారం నామినేష‌న్ లాగే ఈసారి కూడా మ‌ళ్లీ ఏడ్చేసింది. దీంతో ఆమె బాధ‌ను పోగొట్టేందుకు అఖిల్ అభితో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఆమెను న‌వ్వించేందుకు అవినాష్ రెడీ అయ్యాడు. (అమ్మ‌తోడు, నీకు చుక్క‌లు చూపిస్తా: అరియానా)

అవినాష్‌కు ముద్దు, షాక్‌లో అరియానా
"నువ్వు మారిపోయావు, ఛీ ఛీ" అంటూ అల‌క న‌టించాడు. దీంతో ప‌క్క‌న అఖిల్ ఉన్నాడ‌న్న విష‌యం కూడా మ‌ర్చిపోయి మోనాల్ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదుటిపై ముద్దు పెట్టింది. దీంతో ప‌క్క‌నే ఉన్న అరియానా ఒక్క‌సారిగా షాక్ తింది. ఇక‌ ఊహించ‌ని ఆఫ‌ర్ ద‌క్కినందుకు అత‌డు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌‌య్యాడు. నా పొలంలో మొల‌క‌లొచ్చాయ్ అంటూ గాల్లో తేలిపోయాడు. మోనాల్ దృష్టిలో ఏ అంటే అవినాష్‌, అందుకే నాకు ముద్దు పెట్టింది అంటూ ఎగిరి గంతులేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు మోనాల్ మిగ‌తా ఏల‌తో ఉండే బ‌దులు అవినాష్‌తో ఉంటే ఏడ‌వాల్సిన ప‌నే ఉండ‌ద‌ని, ఎప్పుడూ న‌వ్వుతూనే చూడొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. (దివి గ‌ర్ల్‌ఫ్రెండ్ అట‌, తెగ ఫీల‌వుతున్న మాస్ట‌ర్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు