మిస్ గుజ‌రాత్ భామ మోనాల్ గ‌జ్జ‌ర్‌

6 Sep, 2020 18:54 IST|Sakshi

'సుడిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించిన హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌. సినిమాల్లోకి రాక‌ముందు ఆమె ఒక ప్రైవేటు బ్యాంకులో ప‌ని చేసింది. మిస్ గుజ‌రాత్ కిరీటాన్ని ద‌క్కించుకున్న ఈ భామ ద‌క్షిణాదిన తెలుగు, తమిళ‌, మళయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. సీజన్‌ 4లో ఉన్న వ‌న్‌ అండ్ ఓన్లీ హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌. బ్ర‌ద‌రాఫ్ బొమ్మాళి సినిమాలో చివ‌రిసారిగా క‌నిపించింది. తెలుగు అంత‌గా రాని ఈ భామ ప‌లికే చిల‌క పలుకులు ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు బుట్ట‌లో వేసుకుంటాయో చూడాలి. ఎలాగైనా స‌రే ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్  అయి తానేంటో చూపించుకుంటానంటోంది. కానీ ఎమోష‌న‌ల్‌గా వీక్‌ అంటున్న మోనాల్‌ మిగ‌తా కంటెస్టెంట్ల ఎత్తుగ‌డ‌ల‌ను ఎదుర్కోగ‌లుగుతుందా? భావోద్వేగాల‌ను అధిగ‌మించి ముందుకు వెళ్ల‌గ‌లుగుతుందా? అనేది చూడాలి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు