మోనాల్‌ గిఫ్ట్‌: హాట్‌గా ఉన్నానంటున్న అఖిల్‌!

19 Jan, 2021 14:45 IST|Sakshi

ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్‌, సోహైల్‌ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్‌, ల్యాప్‌టాప్‌ కొనివ్వాల్సిందేనని డీల్‌ మాట్లాడుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే ప్రేక్షకులు మరొకటి తలిచారన్నట్లుగా వీళ్ల కల నెరవేరలేదు. విజయం వీళ్లను వరించలేదు. అలా అని వీరి కోరిక అసంపూర్తిగా మిగిలిపోలేదు. అఖిల్‌కు ఓ మహిళా అభిమాని ల్యాప్‌ట్యాప్‌ బహుమతిగా ఇచ్చింది. దీంతో అతడి సంతోషం కట్టలు తెంచుకుంది. తన మీద చూపిస్తున్న అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే ఈసారి ఏకంగా అతడి మనసుకు మరింత దగ్గరైనవాళ్లు ఓ బహుమతినిచ్చారు. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, మోనాల్‌ గజ్జర్‌. (చదవండి: ఇల్లు కొనబోతున్న మోనాల్‌‌?!)

బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్‌ను అంటిపెట్టుకుని ఉన్న మోనాల్‌ షో తర్వాత కూడా అతడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ నానా హంగామా చేస్తోంది. ఈ క్రమంలో అఖిల్‌కు పూల ప్రింట్‌ ఉన్న ఎరుపు రంగు షర్ట్‌ను బహుకరించింది. ఇంకేముందీ.. అఖిల్‌ మరోసారి గాల్లో తేలిపోయాడు. ఆమె ఇచ్చిన షర్ట్‌ ధరించి మోనాల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. నిజంగానే అఖిల్‌కు పూలచొక్కా భలే సెట్టయ్యింది, ఎంతైనా మోనాల్‌ ఇచ్చింది కదా! అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్‌బాస్‌ రన్నరప్‌ అఖిల్‌ ఈ మధ్యే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. అటు మోనాల్‌ డ్యాన్స్‌ ప్లస్ షో‌ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌లో ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడిన విషయం తెలిసిందే! (చదవండి: ఆ రెండింటి విషయంలో కంట్రోల్‌గా ఉండలేను)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు