బిగ్‌ ఎలిమినేష‌న్‌‌: మోనాల్? అవినాష్‌?

5 Dec, 2020 18:56 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఉన్న ఏకైక హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్. గుజ‌రాతీ భామ‌ అయినా తెలుగు నేర్చుకుని మ‌రీ ముద్దుముద్దుగా మాట్లాడేది. ఈ విష‌యంలో వ్యాఖ్యాత నాగార్జున‌ ఆమెను చాలాసార్లు మెచ్చుకున్నారు కూడా. కానీ వీకెండ్స్‌లో ఆమె ధ‌రించే దుస్తుల‌తో స్కిన్ షో చేయ‌డం వ‌ల్ల‌ ఫ్యామిలీ ఆడియ‌న్స్ నుంచి వ‌త్యిరేక‌త వ్య‌క్తమైంది. దీనికి తోడు ట్ర‌యాంగిల్ స్టోరీ కూడా ఆమెను విమ‌ర్శ‌ల పాలు చేసింది. ప‌గ‌లంతా అఖిల్‌తో మాట్లాడుతూ, రాత్రి అభిజిత్‌తో మాట్లాడ‌టం జ‌నాల్లోకి త‌ప్పుగా వెళ్లింది. అయితే యువ‌త మాత్రం ఈ ముగ్గురి స్టోరీ మీద ఆస‌క్తి చూపించారు. మొద‌ట్లో అంతా బాగానే న‌డిచినా రానూనురానూ ఈ ముగ్గురి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఆ గొడ‌వ‌లు చిలికి చిలికి గాలివాన‌గా మారి అపార్థాల అగాధాన్ని సృష్టించాయి. దీంతో చివర‌కు మోనాల్ ఏకాకిగా మారింది. మంచి నీళ్ల గొడ‌వ‌తో మొద‌లైన వీరి ట్ర‌యాంగిల్ స్టోరీ ఆమె అభి, అఖిల్‌ కంటైనర్ల‌లో రంగు నీళ్లు పోసి నామినేట్ చేయ‌డంతో ఎండ్ అయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ షోకు నువ్వు అన‌ర్హురాలివి)

అవినాష్‌కు వీడ్కోలు త‌ప్ప‌దా!
నిజానికి ఈ బిగ్‌బాస్ ప్ర‌యాణంలో మోనాల్‌ ఎన్నోసార్లు నామినేట్ అయినప్ప‌టికీ ఎలాగోలా ఆ గండం నుంచి త‌ప్పించుకుంటూ వచ్చింది. కొన్నిసార్లైతే ఆమెను సేవ్ చేయ‌డం కోసం ఎక్కువ ఓట్లు వ‌చ్చిన‌ స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను బ‌య‌ట‌కు పంపించార‌న్న ఆరోపణ‌లు కూడా ఉన్నాయి. ఈ వారం అభిజిత్‌, అఖిల్‌, అవినాష్‌, మోనాల్ నామినేష‌న్‌లో ఉండ‌గా ఎప్ప‌టిలాగే మిస్ట‌ర్ కూల్ ఎక్కువ ఓట్లతో టాప్ స్థానంలో ఉన్నాడు. చివ‌రి రెండు స్థానాల్లో మోనాల్‌, అవినాష్ ఊగిస‌లాడారు. ఈసారి కూడా బిగ్‌బాస్ త‌న దత్త‌పుత్రిక‌ను పంపించ‌రులే అని అంతా అనుకున్నారు. కానీ పాలు పితికే టాస్కులో అవినాష్‌.. మోనాల్ త‌న‌ను త‌న్నింద‌ని చెప్ప‌డం ఆమెకు నెగెటివ్‌గా మారింది. ఆమె ఓట్ల‌కు మ‌రింత గండి ప‌డింది. ఫలితంగా ఈ వారం ఆమె ఎలిమినేట్ అయిన‌ట్లు ప్ర‌చారం ఊపందుకుంది. కానీ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఎంట‌ర్‌టైన‌ర్ అవినాష్‌ను హౌస్‌ను పంపించేశార‌ట‌. దీంతో ఈసారి కూడా మోనాల్ మ‌ళ్లీ ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి నిజంగా ఎలిమినేట్ అయింది మోనాలా? అవినాషా? అనేది క్లారిటీ రావాలంటే నాగార్జున అధికారికంగా ప్ర‌క‌టించేవ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: దొంగ‌త‌నంగా వాళ్లింట్లో అన్నం తినేదాన్ని)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు