మోనాల్‌ ముద్దు.. అవినాష్‌కి పిల్ల దొరికేనా!

1 Nov, 2020 20:04 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అవినాష్‌ అక్కడి అమ్మాయిలతో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. ఒక్క హారికను మినహా మిగతా అందరితో బాగానే ఆడుకుంటున్నాడు. ముఖ్యంగా మోనాల్‌తో అయితే చాన్స్‌ దొరికితే చాలు పులిహోర కలిపేస్తూనే ఉన్నాడు. మొదట్లో ఆమె అవినాష్‌ని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు అవినాష్ నువ్వు చేసే కామెడీ నాకు నచ్చలేదంటూ మొహం మీదే చెప్పేసింది. కానీ రోజులు గడుస్తున్న కొద్ది వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మోనాల్‌కి ట్రై చేస్తున్న ‘ఏ’ ల్లో అవినాష్ కూడా చేరిపోయాడు.
(చదవండి : మాస్టర్‌ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్‌)

ఇక శనివారం నాటి ఎపిసోడ్‌లో కూడా మోనాల్‌తో అవినాష్‌ బాగానే పులిహోర కలిపాడు. మోనాల్‌ ముద్దు పెట్టిన తర్వాత అవినాష్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చేసి చూపించు అని అరియానాను హోస్ట్‌ నాగార్జున అడగ్గా.. అరియానా అవినాష్‌ని ఇమిటేట్‌ చేసి చూపించింది. దానికి వెంటనే అవినాష్ అలా కాదని, నాలాగా నేను బాగా యాక్ట్‌ చేస్తానని చెప్పాడు. దీంతో మోనాల్‌ పరుగున వచ్చి అవినాష్‌కు ముద్దు ఇచ్చింది. ఇంకేముంది అవినాష్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే నాగార్జున కలుగజేసుకొని అవినాష్‌కి పిల్లను ఇవ్వాలనుకుంటున్న వాళ్లంతా ఈ షో చూడండి అంటూ ఆట పట్టించాడు. అవినాష్‌ పెళ్లి టాపిక్‌ని హౌస్‌మేట్స్‌ పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పూర్తయ్యేలోపు అవినాష్‌కు ఓ మంచి పిల్ల దొరుకాలని కోరుకుందాం.
(చదవండి : బిగ్‌బాస్‌ : మోనాల్‌ని ముద్దు అడిగిన అఖిల్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు