బిగ్‌బాస్‌లో స్వ‌యంవ‌రం: విచ్చేసిన హీరో‌ అఖిల్

25 Oct, 2020 16:38 IST|Sakshi

అటు సినిమాను, ఇటు బిగ్‌బాస్‌ను స‌మానంగా బ్యాలెన్స్ చేస్తాన‌న్న నాగార్జున‌కు ఇప్పుడు అది వీలు కావ‌డం లేదు. 21 రోజులు హిమాల‌యాల్లో వ‌రుస‌గా షూటింగ్ జ‌రుపుకోనున్నారు. దీంతో బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా మామ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు స‌మంత రంగంలోకి దిగారు. తెలుగులో ఆక‌ట్టుకునేలా మాట్లాడుతూ కంటెస్టెంట్ల‌కే కౌంట‌ర్లు విసురుతున్నారు. ఇక ద‌స‌రా పండ సంబ‌రాల‌ను రెట్టింపు చేసేందుకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరో అఖిల్ కూడా వ‌చ్చేశారు. వీరిద్ద‌రినీ బుట్ట‌లో పడేసేందుకు ఇంటిస‌భ్యులు నానాతంటాలు ప‌డుతున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : ‘ఆ విషయంలో మోనాల్‌దే తప్పు’)

డిటెక్టివ్‌గా హైప‌ర్ ఆది
తాజాగా రిలీజైన ప్రోమో ప్ర‌కారం స‌మంత చేతుల మీదుగా హౌస్‌లో స్వ‌యంవరం జ‌ర‌గ‌నుంది. హారిక‌, అరియానా, దివి, మోనాల్‌ల‌ను మెప్పించేందుకు మేల్ కంటెస్టెంట్లు డ్యాన్సుల‌తో రఫ్ఫాడిస్తూ కండ‌ల ప్ర‌ద‌ర్శ‌న కూడా చేస్తున్నారు. ఇక అఖిల్ మాత్రం త‌న సింగింగ్ ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శించాడు. వీరి ప‌ర్ఫామెన్స్‌ల గురించి హీరో అఖిల్ స్పందిస్తూ అంద‌రూ బాగా చేశార‌‌ని మెచ్చుకున్నారు. వీరిద్ద‌రితో పాటు హీరోహీరోయిన్లు కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా షోకి విచ్చేశారు. ఇక డిటెక్టివ్‌గా హైప‌ర్ ఆది వ‌చ్చి పంచులు వేశాడు. సింగ‌ర్ గీతామాధురి కూడా షోలో త‌న గాత్ర‌మాధుర్యాన్ని వినిపించారు. (చ‌ద‌వండి: మ‌నాలిలో నాగ్‌: బిగ్‌బాస్‌కు స‌మంత‌?)

నోయ‌ల్ గురువుగా మారాలి: స‌మంత‌
ఇక అంత‌కు ముందు రిలీజైన మ‌రో ప్రోమోలో హీరోయిన్ సామ్‌ ఒక్కొక్క‌రికి బాగానే పంచులు విసురుతున్నారు. కోప‌మొచ్చిన‌ప్పుడు సోఫా మీద రాసుకోండి అంటూ అవినాష్ మీద సెటైర్ వేశారు. అఖిల్‌ను డ్రెస్ బాగుందంటూనే గుజ‌రాతీ డ్రెస్సా అని అడిగేశారు. ఇక ఎప్పుడూ నాలుగు మంచి మాట‌లు చెప్తూ ఉండే నోయ‌ల్‌ను ఉద్దేశిస్తూ మీరు గురువు అయిపోవాల‌నుకుంటున్నాన‌ని కోరుకున్నారు. అనంత‌రం కంటెస్టెంట్ల‌కు వారి కుటుంబ స‌భ్యులు మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగుల‌ను చూపించ‌డంతో హౌస్‌మేట్స్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఎందరో సెల‌బ్రిటీల‌ను ఒకే స్టేజీ మీద‌కు తీస‌కువ‌చ్చి ద‌స‌రా వినోదాన్ని రెట్టింపు చేస్తూ కన్నుల పండ‌గ చేయనున్న‌ ఈ ఎపిసోడ్‌ చూడాలంటే సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల్సిందే. (చ‌ద‌వండి: అఖిల్-మోనాల్‌ ల‌వ్ ట్రాక్‌కు అభిజిత్ డైరెక్ష‌న్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు