బైక్ రేసింగ్‌: ప‌డిపోయిన అవినాష్‌

16 Oct, 2020 15:42 IST|Sakshi

బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జీవిత‌ క‌ష్టాలు సినిమా క‌థ‌ల‌ను త‌ల‌పిస్తూ అంద‌రినీ కంట‌త‌డి పెట్టించేశాయి అయితే హౌస్‌లో ఉన్న అందరూ ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ పైకి వ‌చ్చిన విధానాన్ని తెలుపుతూ ఎమోష‌న‌ల్ అయ్యారు. దీంతో హౌస్‌లో ఓ ఉద్విగ్న వాతావ‌ర‌ణం అలుముకుంది. దీన్ని పోగొట్టి అంద‌రినీ మ‌ళ్లీ మామూలుగా చేసేందుకు బిగ్‌బాస్ ఓ ఫిజిక‌ల్ టాస్క్ ఇవ్వ‌నున్న‌ట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. అందులో భాగంగా హౌస్‌లో ఉన్న అబ్బాయిల‌కు బైక్ రేసింగ్ పోటీ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. దీనికి అభిజిత్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్ రేసింగ్‌ ఆషామాషీగా ఉన్న‌ట్లు లేదు. (చ‌ద‌వండి: ర‌క్తం కారుతున్నా అమ్మ‌ కిలోమీట‌రు నడిచింది)

ఎన్నో గండాల‌ను దాటుకుని చివ‌రాఖ‌ర‌కు బైక్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో అఖిల్‌, మెహ‌బూబ్‌, సోహైల్, కుమార్ సాయి ఈ టాస్కును ఎలాగోలా పూర్తి చేసేట‌ట్లు క‌నిపిస్తున్నారు. అఖిల్ టాస్క్ మొద‌లు పెట్ట‌గానే అక్క‌డ రిస్క్ ఎక్కువ‌గా ఉండ‌టంతో మోనాల్ కంగారు ప‌డుతోంది. జాగ్ర‌త్త అంటూ అత‌నికి బ‌లాన్ని నూరిపోసే ప్ర‌య‌త్నం చేసింది. మ‌రోవైపు అవినాష్‌ మాత్రం ఈ క‌ష్ట‌తర‌మైన టాస్కు పూర్తి చేసేందుకు నానాక‌ష్టాలు ప‌డుతున్నాడు. ఒకానొక‌న స‌మ‌యంలో ఢ‌మాలున‌ కింద పడ‌టంతో ఇంటిస‌భ్యులు షాక‌య్యారు. మ‌రి ఈ టాస్కులో ఎవ‌రు గెలిచి రేస‌ర్ అనిపించుకుంటారో చూడాలి! (చ‌ద‌వండి: అరియానాకు సారీ చెప్పి గోరుముద్ద‌లు తినిపించిన‌ సోహైల్‌
)

Poll
Loading...
మరిన్ని వార్తలు