బిగ్‌బాస్‌: కాలితో త‌న్నిందా? నాగ్ తీర్పు ఎటువైపు?

5 Dec, 2020 17:49 IST|Sakshi

ప్ర‌తివారం లాగే ఈ వారం కూడా నాగ్ ఇంటిస‌భ్యుల లెక్క తేల్చేందుకు సిద్ధ‌మయ్యారు. కంటెస్టెంట్లు చేసిన త‌ప్పొప్పుల‌ను త‌వ్వి చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా ఈ వారం అటు కంటెస్టెంట్లతో పాటు, ప్రేక్ష‌కులను కూడా తిక‌మ‌క పెట్టిన అంశం ఒక‌టుంది. 'రేస్ టు ఫినాలే' మొద‌టి లెవ‌ల్‌లో పాలు పిత‌క‌డం టాస్కులో మోనాల్ త‌న్న‌డం! ఆమె పాల క్యాన్‌ను త‌న్నాన‌ని చెప్పింది. కానీ అవినాష్ మాత్రం లేదు, నువ్వు న‌న్నే త‌న్నావు, అది కూడా కావాల‌ని చేశావు అంటూ గొడ‌వ ప‌డ్డాడు.

అక్క‌డే ఉన్న మిగ‌తా ఇంటి స‌భ్యులు ఆట‌లో మునిగి అక్క‌డేం జ‌రిగింద‌న్న‌ది ఎవ‌రూ చూడ‌లేక‌పోయారు. ఈ విష‌యంలో అభిజిత్ అవినాష్‌కు స‌పోర్ట్ చేయ‌గా సోహైల్ మాత్రం మోనాల్‌కు మ‌ద్దతుగా నిల‌బ‌డ్డాడు. మోనాల్ త‌న‌ను త‌న్నింద‌ని, అప్పుడు ఆమె షూ తీసేస్తున్నాన‌ని అవినాష్ త‌న‌దే నిజ‌మ‌ని వాదించాడు. అస‌లు ఏం జ‌రిగిందో క్లారిటీ లేదో, లేదా నిజంగానే తన్నిందో కానీ మోనాల్ ఎందుకొచ్చిన గొడ‌వ అనుకుని అవినాష్‌కు సారీ చెప్పింది. కాళ్లు కూడా ప‌ట్టుకోబోయింది. త‌ర్వాత అత‌డికి హ‌గ్గిచ్చి, బుగ్గ‌న ముద్దు పెట్టి ఆ గొడ‌వ అక్క‌డితో వ‌దిలేసేలా చేసింది.

కొలిక్కి రానున్న‌ పంచాయితీ
దీన్ని వీకెండ్‌లో నాగార్జున లేవనెత్తారు. అవినాష్‌, మోనాల్‌ను వేర్వేరుగా క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి మాట్లాడారు. మోనాల్ త‌న‌ను కావాల‌నే త‌న్ని, త‌ర్వాత ఓ లుక్కించిన అవినాష్ చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు మోనాల్ మాత్రం ఈ గొడ‌వ‌ల‌తో తాను అలిసిపోయానంటూ ఏడ్చేసింది. న‌న్ను నేను ఎలా నిరూపించుకోవాలి అని న‌ర్మ‌ద గేట్లు ఎత్తింది. వీరి పంచాయితీని నాగ్ ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంద‌రి అనుమానాలను ప‌టాపంచ‌లు చేసేందుకు వీడియో చూపించనున్నారు. దీంతో నిజం ఎవ‌రి వైపు ఉంద‌నేది నేటి ఎపిసోడ్‌లో నిగ్గు తేల‌నుంది. (బిగ్‌బాస్ ట్రోఫీ గెల‌వ‌లేక‌పోతున్న అమ్మాయిలు)

సోహైల్‌ను తిట్ట‌డం మంచిదే!
'రేస్ టు ఫినాలే' విష‌యానికొస్తే ఇందులో మొద‌టి లెవ‌ల్‌లో సోహైల్, అఖిల్ క‌లిసి ఆడారు. త‌ర్వాతి రౌండ్‌లో ఎవరికి వారే ఒంట‌రిగా ఆడారు. మూడో రౌండ్‌లో ఈ ఇద్ద‌రి మ‌ధ్యే పోటీ నెల‌కొంది. అయితే స్నేహం కోసం సోహైల్ ఉయ్యాల దిగి రేసు నుంచి త‌ప్పుకున్నాడు. దీనిపై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఏదేమైనా ఎంతో ముఖ్య‌మైన ఫినాలే మెడ‌ల్‌ను సోహైల్‌ చేజేతులా చేజార్చుకోవ‌డాన్ని నాగ్ త‌ప్పుప‌ట్టారు.  సాధార‌ణంగా లోప‌లున్న కంటెస్టెంట్ల‌ను నాగార్జున తిడితే వారివారి అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. కానీ సోహైల్ ఫ్యాన్స్ మాత్రం నాగార్జున క్లాస్ పీక‌డం మంచిదేనంటున్నారు. అతి మంచిత‌నంతో స్నేహం కోసం సోహైల్ గేమ్‌లో వెన‌క‌బ‌డ‌కుండా ముందుకు వెళ్ల‌డానికి నాగ్ మాట‌లు అత‌డికి మార్గ‌నిర్దేశ‌మ‌వుతాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. (హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాదు: నాగార్జున‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు