బిగ్‌బాస్‌ : ఆ ఇద్దరికే నా సపోర్ట్‌.. నాగబాబు

25 Nov, 2020 16:50 IST|Sakshi

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తూ విజయవంతగా 11 వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. షో ముగింపునకు 25 రోజులే మిగిలి ఉండటంతో  టైటిల్ విజేత ఎవరన్నదానిపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలోనూ ఆసక్తిమొదలైంది. మరోపక్క ఎలాగైనా టైటిల్‌ కొట్టాలనే కసితో హౌస్‌మేట్స్‌ ఫోకస్‌ అంతా గేమ్‌పైనే పెట్టారు. త్యాగాలు, సపోర్టులు పక్కకు పెట్టి విడివిడిగా గేమ్‌ ఆడుతున్నారు. ఇక ప్రేక్షకులు మాత్రం తమ అభిమాన కంటెస్టెంట్‌ని రక్షించేపనిలో పడ్డారు. ఎవరికి వారు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‌కి మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 
(చదవండి : బిగ్‌బాస్‌లోకి అనుకొని అతిథి.. దడుచుకున్న బోల్డ్‌ గర్ల్)

ఈ తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా బిగ్‌బాస్‌పై స్పందించారు.  జబర్దస్త్ కమెడియన్ అవినాష్, అభిజిత్‌లకు సపోర్ట్ చేయాల్సిందిగా వీడియో విడుదల చేశారు. అవినాస్‌ తనకు చాలాకాలంగా తెలుసని అతనికి సపోర్ట్‌ చేయాలని కోరారు.  అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాష్‌ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు. అలాగే హౌస్‌లో తనకు బాగా నచ్చిన కంటెస్టెంట్‌ అభిజిత్‌ అని, అతని వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని చెపుకొచ్చాడు. 

 ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశాను. మొదటిసారి కలిసినప్పుడే నచ్చాడు. మంచి కుర్రాడు అనిపించాడు. అతను  ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించింది. కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా అవినాష్‌కి నా సపోర్ట్‌ ఉన్నా కూడా నా మనసు, నా ఇష్టం మాత్రం అభిజిత్‌పైనే ఉంది. నన్ను సపోర్ట్‌ చేయమని  ఎవరూ అడుగలేదు. ఎందుకో ఈ ఇద్దరికి సపోర్ట్‌ ఇవ్వాలనిపించింది. ఇద్దరిలో ఎవరు విజేత అయినా నాకు ఇష్టమే. ఇద్దరికి ఓట్లు వేసి ఫైనల్‌ వరకు తీసుకురండి’ అని తన అభిమానులను కోరారు.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు